బీజేపీ జాబితాలో.. సెలబ్రిటీలే సెలబ్రిటీలు!

Update: 2019-04-23 13:30 GMT
ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తి అయినా.. భారతీయ జనతా పార్టీలోకి సెలబ్రిటీల చేరికలు - సెలబ్రిటీలను ఆ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించడమూ కొనసాగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ సెలబ్రిటీలను బరిలోకి దించడం మీద ప్రత్యేకంగా కసరత్తు చేసింది.

కాస్త నేమూ ఫేము ఉన్న వాళ్లను పోటీ చేయించడానికి చాలా ప్రయత్నాలు సాగించింది బీజేపీ. అందులో భాగంగా అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి.. పలువురు సెలబ్రిటీలను కలిశారు. తమ పార్టీలోకి చేరమని వారిని కోరాడాయన. వారిలో కొందరు సానుకూలంగా స్పందించారు. మరి కొందరు సారీ  చెప్పి తప్పుకున్నారు.

ఓవరాల్ గా అయితే బీజేపీ ఈ ఎన్నికల్లో స్టార్ సెలబ్రిటీలను బాగానే పోటీలో ఉంచగలిగింది. తమ పార్టీలోని పాత వారికి తోడు ఈ సారి జయప్రద వంటి వాళ్లను కూడా అభ్యర్థులుగా నిలిపింది కమలం పార్టీ.

ఇక తాజాగా మరో హీరో బీజేపీలోకి చేరారు. ఆయనే సన్నీ డియోల్. ఇటీవలే అమిత్ షా - సన్నీడియోల్ సమావేశం జరిగింది. ఇప్పుడు సన్నీ డియోల్ కమలం పార్టీ కండువా వేసుకున్నారు. బీజేపీలో చేరు. ఈ ఎన్నికల్లో ఆయన పంజాబ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నారని కూడా తెలుస్తోంది.

మరోవైపు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు బీజేపీ వాళ్లు ఢిల్లీ ఈస్ట్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇలా సెలబ్రిటీలతో బీజేపీ కళకళలాడుతూ కనిపిస్తోంది!
Tags:    

Similar News