సెకండ్ వేవ్ పై సీసీఎంబీ తాజా వార్నింగ్
ప్రపంచంలోని పలు దేశాల్లో సెకండ్ వేవ్ విరుచుకుపడుతూ.. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. మన దేశంలో సెకండ్ వేవ్ త్వరలో రానుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ వేవ్ ధాటికి ఇప్పటికే పలు దేశాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర సెకండ్ వేవ్ షురూ అయితే పరిస్థితి ఏమిటి? అన్నది ఆందోళనగా మారింది. ఇదే అంశంపై సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రాణాలకు ప్రమాదమని తేల్చారు.
నిర్లక్ష్యం అసలే వద్దని.. ఏ మాత్రం ఉన్నా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటానికి అవకాశం ఉందంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. వైరస్ బలహీనం కావటంతో కేసులు తగ్గుతున్నాయన్న అపోహతో జనం జాగ్రత్తల్ని పట్టించుకోవటం లేదన్నారు.
మానవ తప్పిదంతోనే దేశంలో రెండో దశ కరోనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రెండో దశ మొదలైతే.. కట్టడి కష్టమేనని.. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన అవసరం రావొచ్చన్నారు. జనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న ఆయన.. టీకా రావటానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న జనాభాకు టీకా అందాలంటే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల వరకు పడుతుందన్న ఆయన.. ఈ లోపు చాలానే వేవ్స్ వస్తూ ఉంటాయన్నారు. తెలంగాణలో కొద్ది రోజులుగా కేసుల నమోదులో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని.. ఈ కారణంగా ఒక రోజు ఎక్కువగా.. ఒక రోజు తక్కువగా కేసులు నమోదవుతున్నాయని.. జాగ్రత్తగా ఉండకుంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. సో.. బీకేర్ ఫుల్.