ఇన్నాళ్లకు సమాధానం చెప్పలేని కౌంటర్ వేసిన బాబు

Update: 2020-11-13 06:15 GMT
అదేం సిత్రమో.. దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ.. నోరు తెరిస్తే చాలు..ప్రత్యర్థుల చేత అదే పనిగా పంచ్ లు వేయించుకునే అలవాటు ఏపీ విపక్ష నేత చంద్రబాబు సొంతం. ఆయన చేసే వ్యాఖ్యల్లో పస కంటే నసే ఎక్కువన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ కారణంతోనే.. ఆయన మాటల్ని పలువురు తీవ్రంగా ఖండిస్తుంటారు. అలాంటి చంద్రబాబు నోటి నుంచి చాలా రోజుల తర్వాత.. కీలక అంశంపై ఆయన నుంచి వచ్చిన స్పందన సరిగా ఉండటమే కాదు.. ఎన్నాళ్లకు బాబు నుంచి ఇంత మంచి లాజిక్ వాదన వచ్చిందన్న మాట వినిపిస్తోంది.

ఊహించని రీతిలో వచ్చిన బెయిల్ పై స్పందించిన ప్రభుత్వం.. వారికి బెయిల్ వద్దని పిటిషణ్ వేసే పరిస్థితి. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో సదరు నిందితులకు బెయిల్ రావటం వెనుక కారణం ఏమిటన్న విషయంపై ఫోకస్ పెట్టగా.. అతడు టీడీపీకి చెందిన లాయర్ గా తేల్చారు. ఈ కారణంతోనే కోర్టును ప్రభావితం చేయగలిగారన్న ఆరోపణలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు.

ఈ నేపథ్యంలో స్పందించారు చంద్రబాబు. తమపై రాజకీయ బురద జల్లుతున్నారని మండిపడిన ఆయన.. కీలక వాదనను వినిపించారు. లేఖ రాశారన్న కారణంతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేశారు. మూడు నెలలు పాటు బెయిల్ రాలేదన్న చంద్రబాబు.. ఎవరో చేసిన ఫోన్ తీసుకొని వాళ్లు చెప్పింది విన్నారన్న కారణంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేస్తే.. యాభై రోజుల వరకు బెయిల్ రాలేదన్నారు.

అలాంటిది ఒక ముస్లిం మైనార్టీ పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటే.. దానికి కారణమైన నిందితులకు 24 గంటలు తిరిగే సరికి బెయిల్ రావటం ఏమిటి? అని ప్రశ్నించారు. అదేమంటే.. టీడీపీ లాయర్ వల్లే బెయిల్ వచ్చిందన్న మాట చెబుతున్నారన్న చంద్రబాబు.. ‘అదే నిజమైతే.. మా నేతలకు నెలల తరబడి బెయిల్ ఎందుకు రాలేదు?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు. నిజమే.. టీడీపీ లాయర్ వల్లే బెయిల్ త్వరగా రావటం నిజమైతే..సొంత పార్టీ నేతల్ని వెంటనే జైలు నుంచి బయటకు తీసుకొస్తాం కదా? అంటూఆయన ప్రశ్నిస్తున్నారు. నిజమే.. బాబు చెప్పిన దాన్లోనూ పాయింట్ ఉంది. ఎన్నాళ్లకు ఆయనో కీలకమైన అంశాన్ని ప్రస్తావించారో కదూ?
Tags:    

Similar News