కేసు వాపస్ తీసుకో ..లేకపోతే , నగ్న ఫోటోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా !..సినీ రచయిత పై కేసు!

Update: 2020-09-07 10:10 GMT
సినీ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్‌ పై బంజారాహిల్స్‌  పోలీస్  స్టేషన్ లో కేసు నమోదైంది. అయన పై కేసు పెట్టింది స్వయానా ఆయాన భార్య కావడం గమనార్హం. బంజారాహిల్స్‌  రోడ్‌ నంబరు 12లోని ఎన్బీటీ నగర్‌ లో నివసించే రచయిత రమణ గౌతమ్‌ అదే ప్రాంతంలో నివసించే ఓ 24 ఏళ్ల యువతిని  ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అయితే , ఆ తరువాత వారిద్దరి మధ్య  మనస్పర్థలు రావడంతో గతేడాది జూన్‌ లో భర్తపై ఆమె వేధింపులు, మోసం కింద బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో కలిసి ఉండేందుకు ఇద్దరు అంగీకరించారు.

అయితే , గత కొన్ని రోజుల నుండి  రమణగౌతమ్‌ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ తరుణం లోనే ఆమెకు ఫోన్లు చేసి ..కేసు వాపసు తీసుకో.. లేదంటే నీ వ్యక్తిగత ఫొటోలన్నింటిని యూట్యూబ్‌ లో పెడతా అని బెదిరిస్తున్నాడని యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరి సినీపరిశ్రమలోనే ఉందని, ఆమె స్నేహితుల వద్ద అసభ్యకరంగా మాట్లాడటం చేస్తున్నాడని ఫిర్యాదులో పొందుపరిచింది. ఆ యువతి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన  బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News