ప్రేయసి చితిపై దూకి ప్రియుడు ఆత్మాహుతి !
ప్రేమ .. ఈ రోజుల్లో బాగా ఎక్కువగా వినిపించే పదం. అయితే నిజమైన ప్రేమ ఈ రోజుల్లో ఉందా అనే సందేహం రాకమానదు. ఎందుకు అంటే జరిగే పరిణామాలన్నీ చూస్తే అలాగే అనిపిస్తుంది. సోషల్ మీడియా లో మొదలైన ప్రేమ ..చెట్ల మధ్యలో ముగిసిపోతుంది. ఈ తరహా ప్రేమలే నేటి సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి ఈ రోజుల్లో ప్రేయసితో పాటు ప్రియుడు కూడా జీవితాన్ని వదిలేసిన ఘటన తమిళనాడు లో జరిగింది. చితిలో తోడై నేనొస్తాన్నమ్మా అంటూ ప్రేయసి చితిలో దూకి ఆత్మాహుతి చేసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. కళ్లకురిచ్చి జిల్లా ఉళ్లందూర్ పేటకు చెందిన ఓ రైతుకు ముగ్గురు కుమార్తెలు. అందులో పెద్దమ్మాయి నిత్యశ్రీ నర్సింగ్ చదువు కుంటుంది. అయితే , కరోనా , లాక్ డౌన్ వల్ల ఆన్ లైన్ లోనే క్లాసులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లంతా ఆన్ లైన్లోనే క్లాసులకు హాజరవుతున్నారు. అయితే ఇంట్లో ఒకే ఫోన్ ఉండడంతో ఫోన్ విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవతో మనస్తాపానికి గురైన నిత్యశ్రీ క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తరలించగా .. అక్కడ 2 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. అదే రోజు మృతదేహాన్ని స్వగ్రామంలో దహనం చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే నిత్యశ్రీ మృతదేహం దహనం అవుతున్న సమయంలో అదే చితిపై మరో వ్యక్తి కూడా తన ప్రాణాలు తీసుకున్నాడు. అనుకోని ఈ సంఘటన తో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆ తర్వాత , పక్క గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి కనిపించడం లేదని ఆ యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యశ్రీ చనిపోయిన రోజు శ్మశానంలో రాముని చూశామని, నిత్యశ్రీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని అతడి స్నేహితులు చెప్పడంతో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు. నిత్యశ్రీని దహనం చేసిన చితి నుంచి సెల్ ఫోన్, వాచీ విడిభాగాలతో పాటు కొన్ని ఎముకల్ని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. అలా తను ప్రేమించిన అమ్మాయి కోసం, రాము ఏకంగా చితిలో దూకి తన ప్రాణాలు కూడా త్యాగం చేసి ఈ రోజుల్లో కూడా నిజమైన ప్రేమ ఇంకా బ్రతికే ఉందని నిరూపించాడు.