పిన్నితో బెడ్ రూంలో దొరికాడు.. నిలదీసిన అత్త హత్య

Update: 2020-05-19 01:30 GMT
వావి వరసలు మరిచిపోయి కామవాంఛతో ఏకంగా పిన్నితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అడ్డు చెప్పిన అత్తను కొడవలితో నరికి చంపాడు. ఈ దారుణం చెన్నైలోని పుళల్ వినాయకపురంలోని పరిమళనగర్ లో చోటుచేసుకుంది.

పరిమళనగర్ కు చెందిన శరవణణ్, గుణసుందరి (37) దంపతులు.. గుణసుందరి తమ్ముడు ఆరు నెలల క్రితం చనిపోతే వరుసకు మరదలు వరసయ్యే అతడి భార్యను ఇంట్లో తెచ్చి పెట్టుకుంది. ఇక అదే కాలనీలో గుణసుందరి సొంత అన్న కుమారుడు గణేషన్(26) ఉంటున్నాడు.

గణేషన్ కు గుణసుందరి తమ్ముడి భార్యకు ఎఫైర్ ఏర్పడింది. సొంత పిన్ని వరుస అయ్యే ఆమెతో గణేషన్ వివాహేతర సంబంధం పెట్టుకొని ఐదు నెలలుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అంతటా నిర్బంధంతో ఇంట్లోనే వీరి వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది.

ఓ రోజు చుట్టాల ఇంటికి వెళ్లింది గుణసుందరి కుటుంబం. మధ్యలో ఏదో పనిమీద ఇంటికి తిరిగివచ్చిన గుణసుందరి.. బెడ్ రూంలో నగ్నంగా శృంగారం చేసుకుంటున్న గణేషన్-తమ్ముడి భార్య ను చూసి తట్టుకోలేకపోయింది. పిన్నితో శృంగారం ఏంట్రా అని గణేషన్ ను నిలదీసింది. హెచ్చరించి మరోసారి రావద్దని గణేషన్ ను ఇంటికి పంపించింది.

అయితే తన ఇంటిలోనే గణేషన్ దుకాణం తెరిచాడు. పిన్నితో రాసలీలలు సాగిస్తుండగా.. మరోసారి గుణసుందరి పట్టుకుంది.. బండారం బయటపెడుతానని చుట్టుపక్కల వారిని పిలుస్తూ అరిచింది. దీంతో గణేషన్ తన గుట్టు బయటపడుతుందని ఆవేశంతో కొడవలితో గుణసుందరిని నరికి చంపాడు. అడ్డువచ్చిన ఆమె భర్తపై దాడి చేయగా తప్పించుకున్నాడు. అనంతరం పారిపోయి ఆంధ్రా సరిహద్దుల్లో దాక్కున్నాడు. పోలీసులు గణేషన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా అక్రమ సంబంధం ఒకరి హత్యకు.. మరొకరిని జైలు పాలు చేసింది.
Tags:    

Similar News