బ్రేకింగ్:గోదావరిలో పడవ మునక..41మంది గల్లంతు

Update: 2019-09-15 10:26 GMT
గోదావరి నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరులో 61 మంది పర్యాటకులతో వెళ్తున్న  పడవ ఆదివారం బోల్తాపడింది. ఈ పడవ నుంచి 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 14 మంది తూటుగుంట గ్రామస్థులు కాపాడారు. మిగిలిన 41 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

61మంది మంది పర్యాటకులతో పాపికొండలకు బోటు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గండి పోచమ్మ ఆలయం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కచ్చలూరులో చాలా లోతుగా గోదావరి ఉంటుంది. ఇక్కడే సుడిగుండాలు ఉంటాయని.. అది చాలా ప్రమాదకర ప్రదేశం అని మత్స్యకారులు చెబుతున్నారు. కచ్చలూరు వద్ద గోదావరి 80 అడుగల మేరకు లోతు ఉంటుందని సమాచారం. ఇక్కడే పడవ బోల్తా పడింది.  గోదావరి నదిలో జాకెట్లతో కొట్టుకుపోతున్న 10 మందిని తూటుగుంట గ్రామస్థులు కాపాడారు. మరో 14 మంది లైఫ్ జాకెట్లు ఉన్నందున సురక్షితంగా బయటపడినట్లు సమాచారం..

కాగా బోటు మునిగిన ప్రమాదంలో ప్రస్తుతం 5 మృతదేహాలను బయటకు తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది..
Tags:    

Similar News