అక్టోబర్ 31 న ఆకాశంలో బ్లూ మూన్ !
ఇప్పటివరకు ఎవరైనా బ్లూ మూన్ చూడలేకపోయిన వారికి మరో అవకాశం వచ్చింది. ఈ నెల 31 న ఆకాశంలో బ్లూ మూన్ కనువిందు చేయబోతుంది. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూ మూన్ గా పిలుస్తారు. ఒక నెలలో సాధారణంగా ఒక పౌర్ణమి, అమావాస్య వస్తూ ఉంటాయని, ఒకే నెలలో రెండు సార్లు పూర్ణ చంద్రులు అసాధారణ సందర్భాలని ముంబై నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ అరవింద్ పరంజ్‌పే తెలిపారు. చంద్రుడి నెల వ్యవధి 29. 531 రోజులని లేదంటే.. 29 రోజులు, 12 గంటలు, 44 నిమిషాలు 38సెకన్లు. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు ఉండాలంటే నెల 1, 2తేదీల్లో తొలి పౌర్ణమి రావాలని పరంజ్ పే చెప్పారు. సుమారు 30 నెలల తర్వాత సంవత్సరంలో ఒక అదనపు పౌర్ణమి ఉంటుందని ఆయన తెలిపారు.
ఫిబ్రవరిలో 28 రోజులు, లీప్ సంవత్సరంలో 29 రోజులు ఉండడం కూడా సాధ్యం కాదని ఆయన అన్నారు. ఢీల్లీలోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ రత్నశ్రీ మాట్లాడుతూ బ్లూ మూన్ సాధారణమైన విషయం కాదన్నారు. 30 రోజులతో ఒక నెలలో చివరి బ్లూ మూన్ జూన్ 30, 2007 న మరొకటి సెప్టెంబర్ 30, 2050 ఉంటుందని పరంజ్‌పే చెప్పారు. 2018లో రెండు బ్లూ మూన్స్ కనిపించాయని, మొదటిది జనవరి 31న, రెండోది మార్చి 31న జరిగిందని పేర్కొన్నారు. రెండోదానికి కారణం ‘ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉండడం మాత్రమే ఉన్నాయని చెప్పారు. కాగా, బ్లూ మూన్‌ను కొన్ని దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు. చలికాలంలో రాత్రిపూట జంతువులను వేటాడటానికి వేటగాళ్లకు ఈ పౌర్ణమి సహకరిస్తుంది. అందుకే దీన్ని హంటర్ మూన్ అంటారు. ఈ నెల 31న మనమంతా ఈ బ్లూ మూన్ చూడవచ్చు.
అయితే ఇలాంటి అద్భుతమైన సంఘటన మరో 19 సంవత్సరాల తర్వాత కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అయితే 76 సంవత్సరాల తర్వాత ఆకాశంలో ఇలాంటి అద్భుతమైన సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు అందరూ ఆ జాబిలమ్మ అందాన్ని వీక్షించేందుకు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.అక్టోబర్ 31, 2020 న ఏర్పడే చంద్రుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీలి చంద్రుడు కానప్పటికీ, ఇది ఇప్పటికీ అపారమైన అంతరిక్ష ప్రభావంతో కూడుకున్న రాత్రి. అంతే కాకుండా ఆకాశంలో చూడడానికి నిజమైన దృశ్యంతో నిండు చంద్రుడు ప్రజలను కనువిందు చేయనున్నాడు.