డ్రగ్స్ తో పట్టుబడిన బీజేపీ మహిళా నేత.. సంఘటనా స్థలంలోనే అరెస్టు!
డ్రగ్స్ తరలిస్తున్న బీజేపీ మహిళా యూత్ లీడర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లో చోటు చేసుకుంది. కారులో డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కాపుకాసిన పోలీసులు.. తనిఖీ చేయగా.. కొకైన్ బయటపడింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ యూత్ లీడర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పమేలా గోస్వామి అనే మహిళ.. తన స్నేహితుడితో కలిసి కోల్‌కతాలోని నయూ అలీపూర్ ప్రాంతంలోని ఎన్‌ఆర్ అవెన్యూకు వెళ్తున్నారు. అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో పమేలా గోస్వామి తన కారులో కొకైన్ తరలిస్తున్నట్టుగా బయటపడింది. ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. అందులో 100 గ్రాముల కొకైన్‌ని కనిపించింది. కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలోనే ఆమెను అరెస్ట్ చేశారు.
ఈ సమయంలో ఆమె వెంట ఫ్రెండ్ ప్రబీర్ కుమార్ దేవ్ ఉన్నాడు. అతను కూడా బీజేపీ యువమోర్చా లో పనిచేస్తున్నాడు. ఓ బాడీగార్డు కూడా ఉన్నాడు. దీంతో.. ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన కొకైన్ విలువ రూ.లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పమేలాకు మత్తు పదర్థాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొంతకాలంగా పమేలా డ్రగ్ ట్రాఫికింగ్‌లో భాగంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ విక్రయించేందుకు గోస్వామితోపాటు ఆమె స్నేహితుడు, డ్రగ్ సప్లయర్ ప్రబీర్ ఆ ప్రాంతానికి చేరుకున్నారని, ఈ విషయం తెలియడంతో అక్కడికి వెళ్లి అరెస్టు చేశామన్నారు.
పమేలా అరెస్ట్‌పై బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి సమిత్ భట్టాచార్య స్పందించారు. ఈ విషయం గురించి విన్నానని అన్నారు. ఆమె నిజంగా తప్పు చేసి ఉంటే చట్టం ఖచ్చితంగా శిక్షిస్తుంది. అయితే ఇది ప్లాన్ చేసినట్లు కూడా కనిపిస్తోంది. నిజా నిజాలు తెలియాలని అన్నారు. కాగా.. గతంలో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసిన పమేలా గోస్వామి.. ఆ తర్వాత మోడల్ గా నటించింది. ఆ తర్వాత బుల్లితెరపైనా కనిపించింది. 2019లో బీజేపీలో చేరిన ఆమెను.. హుగ్లీ జిల్లాకు యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమించింది అధిష్టానం.