బీజేపీకి తిరుగులేదని చెబుతున్న ఫలితాలు

Update: 2017-01-10 05:49 GMT
మొన్నటికి మొన్న హర్యానాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్లింది. తాజాగామహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటం ఆసక్తికరంగా మారింది. పెద్దనోట్ల రద్దు కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారంటూ విపక్షాలు చేస్తున్న వాదనకు భిన్నంగా ప్రజలు ఓట్లతో తీర్పునివ్వటం గమనార్హం.

తాజాగా మహారాష్ట్రలోని పురపాలక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. చివరిదైన నాలుగోదశ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటం గమనార్హం. మొత్తం 244 స్థానాలకు 100 స్థానల్ని కైవశం చేసుకున్న బీజేపీ.. అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఏడు పురపాలక సంఘాల అధ్యక్ష స్థానాల్ని సొంతం చేసుకుంది.

నాలుగు దశల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ మొత్తం 11990కౌన్సిలర్లను.. 71 పురపాలక సంఘ అధ్యక్ష పదవుల్ని సొంతం చేసుకొని తనకు తిరుగులేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఇదే తీరులో హర్యానాలోని ఫరీదాబాద్ పురపాలక సంఘానికి జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. పెద్దనోట్ల రద్దుతో బీజేపీకి దెబ్బ పడటం ఖాయమన్న ప్రచారం సాగుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెలువడటం చూస్తే.. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు విపక్షాలకు చేదు అనుభవాన్ని మిగులుస్తాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News