బీజేపీకి కొత్త రథసారథి..ఆయన ప్రత్యేకతలేంటి?

Update: 2020-01-20 12:49 GMT
రెండో సారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక చాలా సైలెంటుగా జరిగిపోయింది. అందరికీ ఇష్టుడు అయిన జగత్ ప్రకాష్ నడ్డా (జేపీ నడ్డా) పార్టీకి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ శాఖకు చెందిన జేపీ నడ్డా తప్ప అధ్యక్ష పదవికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నాయకుడిగా ఆయన ప్రపంచానికి పరిచయం కానీ నడ్డాది బీహార్. పాట్నాలో చదువుకున్నారు. లా పట్టా మాత్రం హిమాచల్ ప్రదేశ్ లో పూర్తి చేశారు.

జేపీ నడ్డా ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో 2019లో అనూహ్య ఫలితాలు సాధించి అందరి కళ్లలో పడ్డారు. 80 ఎంపీ సీట్లకు గాని 62 ఎంపీ సీట్లు గెలవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వరుసగా రెండోసారి పార్టీ మెజారిటీ సీట్లు గెలవడంలో నడ్డా చాణక్యం ఉంది.

జెపి నడ్డా వయసు 59 సంవత్సరాలు. అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి 60 ఏళ్లలోపే అధ్యక్ష హోదాలోకి వెళ్లడం చిన్న విషయమేమీ కాదు. పైగా బీజేపీ చరిత్రలో ఇది కీలక సమయం. 2024 ఎన్నికల్లో బీజేపీని ఒడ్డు దాటించాల్సిన  మహత్తర బాధ్యత నడ్డాదే.
Tags:    

Similar News