ఆ విషయంలో బీజేపీ తొందరగా కళ్లు తెరవాల్సిందేనా..?
తాజా పరిణామాలు.. బీజేపీని కంటిపై నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎక్కడైనా.. ఏ పార్టీ అయినా.. ప్రజల అభిమానం.. వారి మన్నన అంతకు మించి.. ప్రజల విశ్వాసంపైనే పనిచేస్తాయి. వీటిలో ఏది ఒక్కటి తేడా కొట్టినా.. పార్టీ పుంజుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీ కమల నాథులకు ఎదురవుతోంది. అదేంటి? అనుకుంటున్నారా? బీజేపీ నేతలు తెల్లారిలేస్తే. ఏం చేస్తున్నారు? వైసీపీ ప్రభుత్వంపై విమర్శ లు గుప్పిస్తున్నారు. ఇంకేముంది.. జగన్ అప్పులు చేస్తున్నారని.. విమర్శిస్తున్నారు.
అంతేకాదు, సోము వీర్రాజు సహా పురందేశ్వరి వంటి అగ్ర నాయకులు.. మరో రెండడుగులు ముందుకు వేసి.. రాజధానిగా అమరావతినేకోరుతున్నామని..చెబుతున్నారు. రాజధాని ఇలా అయిపోవడానికి ప్రస్తుత వైసీపీ.. గతంలో టీడీపీప్రభుత్వాలే కారణమని.. కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తమకు అధికారం ఇస్తే.. మూడేళ్లలోనే 10వేల కోట్లతోనే.. రాజధానిని నిర్మిస్తామని కూడా హామీలు గుప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ భారీ ఎత్తున నిధులు ఇస్తున్నారని.. కూడా చెబుతున్నారు.
ఇక్కడే కొంచెం కట్ చేసి.. ఇప్పుడు జనంలోకి వద్దాం... మరి జనాలు ఏమనుకుంటున్నారు? బీజేపీ చెబు తున్నవి నిజాలేనని.. బీజేపీకి కనుక అధికారం ఇచ్చేస్తే.. రాబోయే మూడేళ్లలో(ఎన్నికల అనంతరం) రాజధానిని నిర్మించేస్తారని.. భావిస్తున్నారా? అంటే.. కానేకాదని.. తాజాగా తేలిపోయింది. సాక్షాత్తూ సోముకే బిగ్ షాక్ తగిలింది. ఏ వైసీపీని తిడుతున్నారో.. ఆ వైసీపీతోనే.. బీజేపీకి లోపాయికారీ... ఒప్పందాలు ఉన్నాయని.. రాజధాని రైతులు.. ముక్తంకంఠంతో పేర్కొన్నారు.
అంతేకాదు.. మీవల్లే.. రాజధాని నాశనం అయిపోయిందని.. వారు చెబుతున్నారు. పోనీ.. అమరావతి నుంచి విశాఖకు వెళ్దాం.. అక్కడ బీజేపీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని.. ప్రైవేటు పరం చేయొద్దని కార్మికులు చెబుతున్నారు. కానీ, కేంద్రంలోని మోడీ మాత్రం ప్రైవేటు దిశగా అడుగులు ముమ్మరం చేశారు. దీంతో ఇక్కడ కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర బీజేపీపై వారికి కూడా నమ్మకం లేకుండా పోయింది.
కాబట్టి.. ఇంతకీ చెప్పొచ్చేదంటంటే.. ముందుగా బీజేపీ ప్రజల విశ్వాసం పొందాల్సిన అవసరం.. తాము వైసీపీతో అంటకాగడం లేదని చెప్పాల్సినఅవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇది చేయనంతవరకు.. ప్రయోజనం లేదని.. పరిశీలకులు అంటున్నారు.