లీటర్ పెట్రోల్ రూ.40 .. బీజేపీ ఎంపీ సంచలన ట్విట్ !
పెట్రోల్ ధర లీటరు రూ.40 .. అబ్బా , ఆ మాట వింటుంటే ఎంత హాయిగా ఉందొ కదా. కానీ , లీటర్ పెట్రోల్ 40 రూపాయలకి రావడం కష్టమే. ప్రస్తుతం పెట్రోల్ ధర 90 కి చేరింది. మోడీ ప్రభుత్వం ఇంధన ధరలు ప్రతి రోజు కూడా పెంచుతూపోతోంది. మరికొద్ది రోజుల్లోనే 100 కి చేరినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే .. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు నేల చూపులు చూసినా.. ఇండియాలో మాత్రం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే , ప్రజల నుండి పెద్దగా ధరల పై వ్యతిరేక వాదన లేకపోవడంతో మోడీ ప్రభుత్వం కూడా ఇది ప్రజామోదమే అని ధరల్ని పెంచుకుంటూ పోతుంది.
ఇదిలా ఉంటే ... పెట్రోల్ ధరల పెరుగుదలను తీవ్రంగా ఆక్షేపించారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. హిందుత్వ విధానాలను గట్టిగా సమర్థించే సుబ్రమణ్యస్వామి పెట్రోల్ ధరల పెరుగుదలను తప్పు పట్టారు. లీటర్ పెట్రోల్ ను ప్రస్తుత గణాంకాల ప్రకారం 40 రూపాయలకు ఇవ్వవచ్చని అన్నారు. ప్రాసెస్ చేశాకా లీటర్ పెట్రోల్ 30 రూపాయలు అవుతుందని, మరో పది రూపాయల మొత్తాలను ట్యాక్సులుగా వసూలు చేసినా, 40 రూపాయలకు లీటర్ పెట్రోల్ అమ్మవచ్చని సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేశారు. 40 రూపాయలకే పెట్రోల్ అమ్మవచ్చు అని బీజేపీకి చెందిన ఎంపీనే చెప్తున్నప్పటికీ కూడా , మోడీ ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలపై మాత్రం వెనుకడుగు వేసేలా కనిపించడం లేదు. అయితే , నిజంగానే బీజేపీ ఎంపీ చెప్పినట్టు పెట్రోల్ కనుక లీటర్ రూ. 40 లకే వస్తే ..మోడీ ప్రభుత్వానికే మరో పాజిటివ్ అంశంగా మారుతుంది. స్వామి చెప్పినదాన్ని ఒకసారి మోడీ సర్కార్ ఆలోచిస్తే బాగుంటుంది.