మొన్న దాడి అని చెప్పి.. ఇప్పుడు చంపే ప్రయత్నమా కమలనాథులు?
దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల్లో పుట్టించిన వేడి అంతా ఇంతా కాదు. ఒక ఉప ఎన్నిక ఇంత హాట్ హాట్ గా జరగటం ఇటీవల కాలంలో ఇదేనని చెప్పాలి. ఆ మధ్యన జరిగిన నంద్యాల ఉప ఎన్నికను తలపించేలా తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. సహజసిద్ధంగా దూకుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే టీఆర్ఎస్ పార్టీకి.. బీజేపీ లాంటి ఫైర్ బ్రాండ్ పార్టీతో ముఖాముఖి పోరు జరిగింది లేదు.
తొలిసారి ఈ రెండు పార్టీల మధ్య పడిన ఎన్నికల లడాయి రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. పడాల్సిన రెండు పార్టీల మధ్యే భలే పోటీ మొదలైందన్న భావన కలుగక మానదు. ఇంతకు గంత అన్నట్లుగా మాటల్ని చేర్చే అలవాటున్న పార్టీగా పలువురు టీఆర్ఎస్ ను అభివర్ణిస్తారు.
దానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో బీజేపీనేతల తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ గంటల్లోకి వచ్చేసిన వేళ.. రెండు పార్టీల మధ్య ఆరోపణలు.. విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలతో హీట్ ఓ రేంజ్ లో పెరిగినట్లుగా చెప్పాలి. ఇలాంటివేళ.. బీజేపీ నేతల నోటి నుంచి వచ్చే మాటలు కొన్ని ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి.
ఎక్కడిదాకానో ఎందుకు? మొన్న సిద్దిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారని.. దాడికి యత్నించినట్లుగా కమలనాథులు కస్సుమన్నారు. మొన్నటివరకు అదే మాటను అదే పనిగా చెప్పిన బీజేపీ నేతలు ఆదివారం సాయంత్రం నుంచి తమ మాటల్ని పూర్తిగా మార్చేశారు. సిద్దిపేటలో బండి సంజయ్ ను చంపే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని.. అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. బీజేపీ నేతల తీరు చూస్తే.. బండి సంజయ్ మీద మొన్నటి వరకు దాడి అన్నది కాస్తా.. ఇప్పుడు చంపే ప్రయత్నం అంటున్నారు. ఈ లెక్కన రేపు ఇంకేమంటారో? అన్న సందేహం కలుగక మానదు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం తీసిపోని పార్టీగా బీజేపీని పలువురు అభివర్ణిస్తున్నారు.