ఆలయంలో దౌర్జన్యానికి దిగిన బీజేపీ నేత..కేసు నమోదు!
ఏపీలో ఆలయాలను పరిరక్షించాలని, హిందూత్వంపై కొనసాగుతోన్న దాడులను అరికట్టాలని బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు ఓ ఉద్యమాన్నే కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడం, అంతకు ముందు కొండబిట్రగుంట వంటి ఒకటి , రెండు ఆలయాల్లో ఇవే తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు వరుస ఉద్యమాలకు పిలుపునిచ్చారు.ఈ పరిణామాల మధ్య బీజేపీ నేతల జోరుకు బ్రేక్ పడేలా వ్యవహరించారు సొంత పార్టీకి చెందిన నేత. ఆలయంలో అర్చకులు, సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మధ్యలో నువ్వెవడివి.. అంటూ విరుచుకుపడ్డారు. ఆలయ అధికారుల బాధ్యతలేంటో గుర్తు చేశారు. లడ్డూ పనులు చూసుకోవాలే తప్ప అభిషేకాలు చేస్తామనానికి అధికారం లేదని అన్నారు. దీనితో అర్చకుడు, ఆలయ సిబ్బంది ఆయనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ నిబంధనల ఉల్లంఘన కింద ఆ బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాాత మహానంది ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బీజేపీ నేత పేరు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి. బీజేపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జి. మహానందీశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ఆయన తన అనుచరులతో కలిసి ఆలయానికి వెళ్లారు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఆలయాల్లో భక్తుల ప్రవేశంపై, పూజాదికాలను నిర్వహించడంపై ఆంక్షలు ఉన్నాయి. తన అనుచరులతో కలిసి ఆలయానికి వెళ్లిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి.. గర్భగుడిలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అర్చకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి అని, ఎవరికీ ప్రవేశం లేదని తెలిపారు. అభిషేకం తామే చేస్తామని, మధ్యలో నువ్వెవడివి అంటూ మండిపడ్డారు. అభిషేకం చేసే అధికారం నీకు లేదని చెప్పారు. తాము ఇచ్చే డబ్బులు తీసుకుని దేవాలయంలో అన్నీ సమకూర్చాల్సి ఉంటుందని, లడ్డూల పనులు చూసుకోవాలని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన తరువాత అర్చకులు, ఆలయ సిబ్బందిపై బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.