కరోనా వ్యాక్సిన్ పై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు
కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు వ్యాక్సిన్ ను బహుళ మోతాదుల్లో తీసుకోవాల్సి ఉంటుందని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చెప్పారు. ఈ బిలియనీర్ బుధవారం ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ "ఈ సమయంలో టీకాలు ఏవీ ఒకే మోతాదుతో పనిచేస్తాయని అనిపించడం లేదని’ ఆయన అన్నారు.
150కి పైగా కరోనా టీకాలు ప్రస్తుతం వివిధ దేశాల్లో వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయని.. కొన్ని ఇప్పుడు చివరి దశ క్లినికల్ ట్రయల్‌కు చేరుకున్నాయని తెలిపారు.
కరోనాను ఓడించేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీ ప్రయత్నానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 300 మిలియన్లను విరాళంగా ఇచ్చిందని బిల్ గేట్స్ తెలిపారు. మహమ్మారిని ఎదుర్కోవటానికి సురక్షితమైన.. సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం అత్యవసరమని గేట్స్ ఇంతకు ముందు ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
"కరోనా వ్యాక్సిన్ ను బిలియన్ల మోతాదులను తయారు చేయాలి. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి వాటిని తీసుకురావాలి. వీటన్నింటినీ వీలైనంత త్వరగా జరగడానికి మాకు అవసరం" అని ఆయన రాశారు.
మహమ్మారిని అధిగమించడానికి ప్రపంచం కనీసం ఏడు బిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను తయారు చేసి పంపిణీ చేయాల్సి ఉంటుందని బిల్ గేట్స్ తెలిపారు. బహుశా 14 బిలియన్లు అవసరమని గుర్తించారు. ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఎందుకంటే మహమ్మారిని ఆపడానికి.. టీకాను దాదాపు ప్రతి వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది అని గేట్స్ చెప్పారు.