బిహార్ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు జరిగిన నష్టం అంతట

Update: 2020-11-13 06:30 GMT
సర్వే అంచనాలకు భిన్నంగా బిహార్ ఎన్నికల పలితాలు వెలువడటం తెలిసిందే. విజయానికి చేరువ అయినట్లే అయి.. దూరం కావటం మహా ఘట్ బంధన్ కు తీవ్రమైన నిరాశకు మిగిల్చింది. బిహార్ ఎన్నికల ఫలితాలతో తేజస్వీ యాదవ్ హైలెట్ అయ్యాడు. ఆయన్ను భవిష్యత్తు నేత అన్న మాటను పదే పదే ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన పరిస్థితి ఎదురైనట్లుగా చెబుతున్నారు. బిహార్ ఎన్నికల్లోప్రాంతీయ పార్టీలు సాధించిన సీట్ల మందంగా కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటకపోవటం ఇప్పుడా పార్టీకి చేటుగా మారినట్లు చెప్పాలి.

బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 స్థానాల్లో పోటీ చేసింది కానీ విజయాన్ని సొంతం చేసుకుంది మాత్రం 19 సీట్లలోనే. నిజానికి ఇంత భారీగా సీట్లు కోల్పోవటం కూడా మహాకూటమి అధికారంలోకి రాకపోవటానికి కారణంగా చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కూటమిలోని కమ్యునిస్టులు సైతం కాంగ్రెస్ కంటే మెరుగయ్యారు. వారు పోటీ చేసిన సీట్లు.. గెలిచిన సీట్ల లెక్క ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

బిహార్ లో లెఫ్టుపార్టీలు 25 సీట్లలో పోటీ చేస్తే.. వాటిల్లో 16 స్థానాల్లో విజయం సాధించటం గమనార్హం. బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో.. రానున్న రోజుల్లోజరిగే రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీకి కేటాయించే సీట్లలో మిత్రపక్షాలు కోత విధించే వీలుందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీచేయటం.. జాతీయ పార్టీగా కాంగ్రెస్ కున్న ఇమేజ్ తో ఎక్కువ సీట్లను అడుగుతోంది. సర్లేనని.. సర్దుబాటు చేసుకుంటే గెలవలేని పరిస్థితి. దీంతో.. ప్రత్యర్థి పార్టీలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితే బిహార్ లోనూ చోటు చేసుకుందని చెప్పాలి.

ఒక్క బిహార్ లోనే కాదు.. గత ఏడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ఎన్సీపీ కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కానీ..ఎన్సీపీ కంటే తక్కువ స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకోగలిగింది.  ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేసి 54 స్థానాల్లో విజయం సాధిస్తే.. కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేసి కేవలం 44 స్థానాల్లోనే గెలిచింది. అంతకు ముందు అంటే.. 2017లో యూపీలో జరిగిన ఎన్నికల్లోనూ 114 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఏడంటే ఏడు స్థానాల్లో గెలవటం ద్వారా.. అధికారం బీజేపీ చేతుల్లోకి వెళ్లేందుకు కారణమైందని చెప్పక తప్పదు. ఈనేపథ్యంలో.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు కేటాయించే సీట్లలో కోత పెట్టటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News