బిగ్ బ్రేకింగ్: బీజేపీతో పవన్ కళ్యాణ్ కటీఫ్?
బీజేపీపై ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ లో అసహనం బయటపడింది. జీహెచ్ఎంసీలో వెనక్కిలాగడం.. తిరుపతి సీటులో కాంప్రమైజ్ చేయడంతో ఇప్పటికే జనసైనికులు రగిలిపోతున్నారు. తాజాగా ఆ లోలోపల ఉడుకుతున్న కుతకుత జనసేనాని పవన్ లోనూ బయటపడిపోయింది.
ప్రతీసారి పవన్ కళ్యాణ్ ను కూరలో కరివేపాకులా తీసివేస్తోందని.. బీజేపీపై జనసేన నేతల్లో ఒకింత ఆగ్రహావేశాలే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించిన జనసేనను కాదని తిరుపతిలో బీజేపీ పోటీచేయడంపై ఇప్పటికే రగిలిపోతున్నారు.
ఇప్పుడు ఆ వేడి పవన్ కళ్యాణ్ కు తగిలినట్టుంది. ప్రస్తుతానికి తెలంగాణ బీజేపీతో పవన్ కటీఫ్ చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన జనసేన ఆవిర్బావ వేడుకల్లో భాగంగా మాట్లాడిన పవన్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేనతో ఉన్నా తెలంగాణ బీజేపీ మా పార్టీని అవమానించింది. జనసేనను చులకన చేసేలా తెలంగాణ బీజేపీ మాట్లాడింది. అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థి అయిన పీవీ కుమార్తె వాణికి మద్దతిస్తున్నాం. పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు’ అని పవన్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన బీజేపీలో దుమారం రేపింది. బీజేపీతో పవన్ కటీఫ్ దిశగా పయనిస్తున్నాడా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.