అమెరికాలో రికార్డ్: ఒబామాను బీట్ చేసిన బైడెన్
అమెరికా చరిత్రలోనే ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. తమ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అమెరికన్లు పోటెత్తారు. అది డొనాల్డ్ ట్రంప్ ను దించాలన్న కసినా? లేక బైడెన్ ను అధికారం ఎక్కించాలన్న తపనో కానీ ఓట్లు పోటెత్తాయి. అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఇదో రికార్డ్ గా చెప్పవచ్చు.
ప్రచారం, విమర్శల్లో పోటాపోటీగా నిలిచిన అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్, జోబైడెన్ లు పాపులర్ ఓట్ల సాధనలోనూ సై అంటే సై అనేలా కనిపించారు.
ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి బైడెన్ కు ఏకంగా 7.20 కోట్లకు పైగా పాపులర్ ఓట్లతో చరిత్ర సృష్టించారు.
2008 ఎన్నికల్లో ఇదే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి పూర్వ అధ్యక్షుడు బరాక్ ఒబామా సాధించిన 6.94 కోట్ల ఓట్లు (52.9శాతం) రికార్డును తాజాగా జోబైడెన్ చెరిపేయడం విశేషం.
అమెరికా చరిత్రలోనే 7 కోట్ల మార్క్ ను చేరుకున్న తొలి అభ్యర్థిగా జోబైడెన్ ఘనతకు ఎక్కారు. మరో విశేషం ఏంటంటే ప్రత్యర్థి ట్రంప్ సైతం 7 కోట్ల పాపులర్ ఓట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో విజయం సాధించినా 6.29 కోట్ల (46.1శాతం ) కంటే ట్రంప్ నకే చాలా ఎక్కువ పాపులర్ ఓట్లు వచ్చాయి. కానీ ట్రంప్ ఓటమిబాటలో ఉన్నారు. 2016లో డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 6.58 కోట్ల ఓట్లు దాదాపు 48.1 శాతం ట్రంప్ కంటే పాపులర్ ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కానీ విజేతను నిర్ణయించే ఎలక్ట్రోరల్ ఓట్లలో ఆమె వెనుకబడి ట్రంప్ చేతిలో ఓడిపోయారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 66.8శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. అమెరికాలో ప్రస్తుతం 23.9 కోట్ల ఓటర్లున్నారు. ఇందులో 15.9 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం 120 ఏళ్లలోనే ఇది తొలిసారి. 2016లో కేవలం 13.6 కోట్ల ఓట్లే పోల్ అయ్యాయి. భారీ పోలింగ్ వల్లే ట్రంప్, జోబైడెన్ కు ఏకంగా 7 కోట్లకుపైగా ఓట్లు వచ్చాయి.