పోలీసులకు దిమ్మ తిరిగేలా సడన్ షాకిచ్చిన భూమా అఖిలప్రియ
ఓపక్క ప్రభుత్వం స్పందించినా.. రైతుల కష్టాలకుచెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్నా.. ఏదో రకంగా లొల్లి చేయాలన్నట్లుగా ఉంది ఏపీ విపక్ష నేతల తీరు. ఇటీవల కాలంలో పెద్దగా వార్తల్లో కనిపించని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తన ఉనికిని చాటుకోవాలనుకున్నారో ఏమో కానీ.. ఆమె తీసుకున్న నిర్ణయం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తతకు దారి తీసింది. అప్పటివరకు మామూలుగానే ఉన్న ఆమె.. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం స్థానిక పోలీసులకు షాకిచ్చింది. విపరీతమైన హైరానాకు గురి చేసింది. ఇంతకీ ఆమె ఏం చేశారంటారా? అక్కడికే వస్తున్నాం.
రైతులకు న్యాయం చేయాలని ఆమె నిరసనకు దిగారు. ఇటీవల వచ్చిన వర్షాలు.. వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నివర్ తుపానుకారణంగా నష్టపోయిన రాయలసీమ రైతులతో పాటు.. క్రిష్ణా.. గుంటూరురైతుల్ని ఆదుకోవాలని కోరారు.
అప్పటికప్పుడు చేసిన ధర్నాలో అఖిల ప్రియతో పాటు.. ఆమె సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి కూడా హాజరయ్యారు. మాజీ మంత్రి తీసుకున్న నిర్ణయం కారణంగా పోలీసులు హైరానాకు గురయ్యారు.ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ధర్నాకు అనుమతి తీసుకోకుండా చేపట్టటంపై పోలీసులు గుర్రుగా ఉన్నారు. వెంటనే.. ధర్నా విరమించాలని పోలీసులు కోరినా.. ఆమె పట్టించుకోలేదు. నిరసనను కొనసాగించారు.
రైతులకు పరిహారం ఇవ్వకపోతే ఆళ్లగడ్డలో మళ్లీ పాత రోజులు వస్తాయని హెచ్చరించిన భూమా అఖిల ప్రియ తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఎందుకంటే.. 2019 సీజన్ కు సంబంధించి పంట నష్టానికి సంబంధించి బీమా పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంతో రాష్ట్రంలోని 9.48 లక్షల మంది రైతుల ఖాతాల్లో జగన్ ప్రభుత్వం రూ.1252 కోట్లను జమ చేసింది. ఓపక్క రైతులకు మేలు చేస్తున్నా.. అందుకు భిన్నంగా అఖిల ప్రియ హడావుడి చేస్తున్న తీరును తప్పుపడుతున్నారు.