బాబర్ అజామ్ నన్ను చంపేయాలని చూస్తున్నాడు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజామ్ తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే తనపై కొందరు వ్యక్తులు హత్యకు యత్నించారంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్ని వారాల కిందట ఓ మహిళ క్రికెటర్ బాబర్ నన్ను మోసం చేశాడంటూ, పెళ్లి చేసుకుంటానని లైంగికంగా వేధించాడని, పదేళ్లపాటు తనతో గడిపాడని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన పెద్ద దుమారమే రేపింది.
అయితే ఇప్పుడు అదే మహిళ బాబర్ పై ఆరోపణలు చేసిన తర్వాత తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య ప్రయత్నించారని, తనను రక్షించాలని పోలీసులను ఆశ్రయించింది.బాబర్ తనను లైంగికంగా వాడుకున్నాడని.. తనకు గర్భం రావడానికి కారకుడయ్యాడని ఈ మహిళ చెప్పుకొచ్చింది.బాబర్ ఆజామ్ క్రికెటర్ కాకముందే పేదరికంలో ఉండేవాడని.. అప్పుడు తానే ఖర్చులన్నీ భరించినట్లు కూడా ఆమె చెప్పింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి బాబర్ గతకొన్నేళ్లుగా తనను లైంగికంగా వాడుకున్నట్లు, ఒకానొక సమయంలో ఇరువురి కలయికతో తాను గర్భం దాల్చినట్లు కూడా తెలిపింది.
అయితే బాబా పై ఆరోపణలు చేసి అప్పటి నుంచి తనపై అదే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆమె వెల్లడించింది. కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. ఇటీవల కాల్పులు కూడా జరిపారని తాజాగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ దీనిపై కల్పించుకుని తనకు రక్షణ కల్పించాలని కూడా ఆమె కోరారు. పోలీసులు ఈ విషయంపై ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ లో స్టార్ గా ఎదుగుతున్న బాబర్ పై మహిళ అత్యాచారం, హత్యకు ప్రయత్నిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.