బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెల్లడి .. అద్వానీ స్పందన ఇదే !
దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి, రెండు మతాల మధ్య విభేదాలను తీవ్రతరం చేసిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాబ్రీ కూల్చివేత ఘటనలో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ సంఘ్ నేతలు 32 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తాజా తీర్పు, మహత్మపూర్వకమైన తీర్పు అన్న అద్వానీ... దీన్ని అందరం స్వాగతించాలి అన్నారు. ఇది సంతోషకర అంశం అన్నారు. బీజేపీ పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా ఈ తీర్పును భావిస్తున్నాను. నా చిరకాల కోరిక అయోధ్య మందిరంపై సుప్రీంకోర్టు తీర్పు, ఇటీవలే భూమి పూజ కూడా జరిగిన నేపథ్యంలో ఇంకా మహదానందంగా ఉంది. ఇక భవ్యరామ మందిర నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందాని నా దేశప్రజలతో కలిసి ఎదురుచూస్తున్నాను'' అని అద్వాని తెలిపారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అందరికంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నది అద్వానీయే. ఈ కేసులో ఆరోపణల వల్ల అద్వానీ, రాజకీయ జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడ్డాయి. ఆయన లౌకిక వాదిగా వ్యవహరించట్లేదన్న విమర్శలు వచ్చాయి. ఈ కేసులో అద్వానీ నిర్దోషిగా ప్రకటించబడటంతో ఆయన నివాసానికి పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు వెళ్లి శుభాకాంక్షలు