అర్థరాత్రి వేళ.. బెజవాడలో భారీ అగ్నిప్రమాదం
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఉదంతంలో భారీగా ఆస్తి నష్టం తప్పించి.. ప్రాణ నష్టం ఏమీ లేకపోవటంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. చిట్టినగర్ లోని మిల్క్ ప్రాజెక్టు సమీపాన ఉన్న పాత ప్రసాద్ థియేటర్లో అర్థరాత్రి వేళలో హటాత్తుగా మంటలు చెలరేగాయి.
చూస్తుండగానే.. ఈ మంటల తీవ్రత అంతకంతకూ ఎక్కువ అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. కరోనా నేపథ్యంలో థియేటర్ ను మూసి ఉంచటంతో ప్రాణ నష్టం తప్పినట్లుగా చెప్పాలి.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో థియేటర్ కు దగ్గరగా ఉన్న వారంతా తీవ్రం ఆందోళనకు గురవుతున్నారు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మొత్తానికి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో.. బిక్కుబిక్కుమంటు గడిపిన అక్కడి ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.