లక్షణాలు లేని కరోనా పేషెంట్లను గుర్తించవచ్చు.. యాప్ తీసుకొచ్చిన అమెరికా సైంటిస్టులు
కరోనా మహమ్మారి ఇప్పట్లో మనల్ని వదిలిపెట్టేటట్టు లేదు. కొంతమందికి ఏమాత్రం అనారోగ్యం ఉండటం లేదు. కరోనా లక్షణాలు కూడా కనిపించడం లేదు. కానీ పరీక్షలు చేస్తే కరోనా ఉన్నట్టు నిర్ధారణ అవుతున్నది. అటువంటి వారు తమకు తెలియకుండానే ఇతరులకు కరోనా అంటిస్తున్నారు. వీరినే అసింప్టొమేటిక్ కోవిడ్-19 పేషెంట్లు అంటున్నారు. అయితే ఇటువంటి వారికి గుర్తించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఓ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని.. ఎవరైనా సరే తమలో అసింప్టొమేటిక్ లక్షణాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యవంతుడికి, తనకు మధ్య ఉన్న తేడాను గమనించవచ్చు. అమెరికా లోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రీసర్చర్లు ఈ యాప్ ను అభివృద్ధి చేశారు.
ఒక వ్యక్తి దగ్గే తీరు, పలికే పదాలను బట్టి... సదరు వ్యక్తి అసింప్టొమేటిక్ పేషెంటా? కాదా? అని యాప్ నిర్ధారిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యాప్ పని చేస్తుంది. తమను తాము పరీక్షించుకోవాలనుకునే వారు ఏం చేయాలంటే... తమ దగ్గును, మాటలను వెబ్ బ్రౌజర్లు, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ డివైజెస్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వీటిని యాప్ తన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. తన వద్ద ఉన్న వేలాది దగ్గులు, పదాల ఉచ్చారణలతో పోల్చి... ఆ వ్యక్తికి కరోనా సోకిందా? అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. కరోనా పేషెంట్ల నుంచి రికార్డ్ చేసిన వేలాది దగ్గుల శబ్దాలను యాప్ లో ఫీడ్ చేశారు. కరోనా బారిన పడిన వారి 100 శాతం (అన్ని రకాలు) దగ్గులను ఇందులో చేర్చామని పరిశోధకులు తెలిపారు. ఈ యాప్ ను త్వరలోనే ప్రజలముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వస్తే లక్షణాలు లేని కరోనా రోగులను గుర్తించడం ఇక తేలిక కానున్నది.