ఎన్టీయే నుంచి బయటకు రండి: నితీష్ కు ఓవైసీ ఆఫర్

Update: 2019-12-30 05:39 GMT
కేంద్రం లో కొలువుదీరిన ఎన్టీఆర్ సర్కారు నుంచి జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ బయటకు రావాలని ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. బిహార్ లోని కిషన్ గంజ్ లో నిర్వహించిన నిరసన ర్యాలీ లో ఈ మేరకు అసద్ ఓ భారీ ఆఫర్ ను నితీష్ కు ఇచ్చారు.

ప్రధాని మోడీ, హోంమంత్రి షాలు దేశాన్ని విభజించేలా పాలిస్తున్నారని.. వారు తీసుకొని ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకం గా నితీష్ పోరాడాలని ఓవైసీ సూచించారు. వెంటనే వాటికి మద్దతు ఉపసంహరించుకొని ఎన్డీఏ నుంచి బయట కు రావాలని నితీష్ కు సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ లో ఉండ వద్దని కోరారు.

నితీష్ ఎన్టీఏ నుంచి బయట కు వస్తే వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము నితీష్ కు మద్దతు ఇస్తామని.. అండగా నిలబడుతామని ఓవైసీ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

దేశ వ్యాప్తంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కు మంచి గుర్తింపు ఉందని.. దానిని కాపాడుకోవాలని అసదుద్దీన్ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం బీజేపీ కి వ్యతిరేకం గా పోరాడాలని సూచించారు.


Tags:    

Similar News