వయసు మీద పడ్డా..నాలుగో పెళ్లికి రెఢీ అయ్యాడు

Update: 2020-11-06 06:30 GMT
వయసు మీద పడినా.. దరిద్రపుగొట్టు బుద్ధులతో చిక్కుల్లో పడేటోళ్లు చాలామందే ఉంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని.. రిటైర్ అయిన తర్వాత కూడా నాలుగో పెళ్లికి సిద్ధమైన వ్యక్తి వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. విశాఖపట్నం డాక్ యార్డ్ లో ఉద్యోగిగా పదవీ విరమణ చెందాడు విష్ణు. దాదాపు పన్నెండేళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీసరోజతో పెళ్లైంది.

ఆ సమయంలో రూ.5లక్షలు కట్నం.. లాంఛనాలు ముట్టచెప్పారు. పెళ్లి తర్వాత.. అతడికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన విషయం తెలీదు. పిల్లలు పుట్టే అవకాశం లేకపోవటంతో ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన రిటైర్ అయిన అతడు.. భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో.. ఆమె పుట్టింటికి వచ్చేసింది.

ఇదిలా ఉంటే.. మరో పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైన అతగాడు.. భార్య వద్దకు వచ్చి.. విడాకుల పత్రం మీద సంతకం చేయాలని బలవంతం చేయసాగాడు. దీంతో..అతడి హింసను భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. విడాకులు లాంటివి ఏమీ తీసుకోకుండానే.. నాలుగో పెళ్లి కోసం వివాహ ప్రకటన ఇచ్చిన వైనాన్ని ఆమె తన కంప్లైంట్ తో జత చేయటంతో.. ఈ ప్రబుద్ధుడి తీరు బయటకు వచ్చింది. వయసు మీద పడినా.. ఈ దరిద్రపుగొట్టు ఆలోచనలు ఎందుకో?
Tags:    

Similar News