తప్పు అని చెప్పినందుకు పదవిలోంచి గెంటేశారు..

Update: 2018-03-13 12:55 GMT
కొందరంతే ... చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి.. ... అనే సామెత అలాంటి వారికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. తన సమక్షంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మీద తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దాడిచేసి కొట్టడాన్ని ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉండిపోయినందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అపకీర్తిని మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత.. ఆ వ్వవహారం పోలీసు కేసుగా మారినప్పుడు.. ఇదంతా భాజపా చేసిన కుట్ర, అబద్ధపు ఆరోపణలు అంటూ.. తన పార్టీ నాయకుల చౌకబారు స్టేట్ మెంట్లు ఇచ్చినప్పుడు ఆయన మౌనం పాటించారు. తీరా ఇప్పుడు.. ఆ వ్యవహారంలో తప్పు చేసిన వారిని , తప్పు అని సాక్ష్యం చెప్పినందుకు తన మిత్రుడే అయినా పట్టించుకోకుండా.. సలహాదారు పదవినుంచి కేజ్రీవాల్ , వీకేజైన్ ను బయటకు గెంటేశారని ప్రజలు అనుకుంటున్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సన్నిహితుడిగా ముద్ర ఉన్న.. ఆయనకు సలహాదారు అయిన... వీకే జైన్ మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. తమాషా ఏంటంటే.. సీఎం ఇంట్లో ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీ పై దాడిచేసిన రోజునుంచి ఆయన సెలవులోనే ఉన్నారట. అంటే చూడబోతే.. ఆ దురాగతానికి సాక్షిగా ఉన్నందుకు ప్రభుత్వమే ఆయనను బలవంతంగా సెలవుపై పంపినట్లుగా ఉన్నదని పలువురు అనుకుంటున్నారు.

అదంతా బాగానే ఉంది. కానీ కేజ్రీవాల్ గురించి ప్రజలకు కొన్ని మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ఇలా నిజాయితీగా సాక్ష్యం చెప్పినందుకు ఆయన పనిష్మెంట్ ఇవ్వడం ప్రారంభిస్తే.. అలాంటి అభిప్రాయాలు చెరగిపోతాయి కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

రాజకీయాల్లో ఎప్పుడూ ఇలాగే ఉంటుందని.. కళ్ల ముందు జరిగినా.. తమ పార్టీ వాళ్లయితే.. చేసిన నేరాల్నించి కూడా కాపాడడం ఇక్కడ ప్రాథమిక ధర్మం అని.. అందుకు రాజకీయాల్లో కుళ్లును - అవినీతిని - అరాచకాల్ని కడిగేస్తాం.. తుడిచేస్తాం - శుభ్రం చేస్తాం అంటూ పుట్టిన ఈ చీపురు పార్టీ అతీతం కాదని ఈ సంఘటన నిరూపిస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News