చలిని ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధం ... వింటర్ డీజల్ అందించిన ప్రభుత్వం !
చైనాతో ఘర్షణలు, మరోవైపు ఎముకలు కొరికే చలి, అయినప్పటికీ భారత సైన్యం అన్నింటిని ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధం అవుతుంది. కాశ్మీర్ లో చలికాలం ప్రారంభం అవుతుంది. ఆ చలిలో భారత సైన్యం పాంగాంగ్, గాల్వన్ లోయల నుండి వెనక్కి వెళ్తుందన్న చైనా ఆలోచనలకు చెక్ పెడుతూ భారత సైన్యం అడుగులు ముందుకువేస్తుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇంధనం, 40వేల మంది సైన్యానికి సరిపడా ఆహర పదార్థాల నిల్వలతో పాటు శీతాకాల నిత్యవసరాలను ఎత్తైన ప్రదేశాలకు తరలించాయి. యుద్ధప్రాతిపదికన చేపట్టిన ఈ ఆపరేషన్ పూర్తి కావొచ్చింది.
చలికాలం ఇబ్బందులను ఆసరాగా తీసుకొని చైనా దాడి చేస్తే తిప్పికొట్టేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకుంది. సముద్రమట్టానికి 16వేల అడుగులో కాపలా ఉన్న భారత సైనికుల కోసం హీటర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ, దుస్తులు, గుడారాలను చేరవేశారు. భారత వాయుసేనలోని సి-130జె, సి-17 గ్లోబ్‌మాస్టర్ సహా అన్ని రవాణా విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించింది. స్వాతంత్య్రం తర్వాత లద్దాఖ్‌లో చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ అని ఆర్మీ అధికారులు అంటున్నారు. అక్కడ వీచే శీతలగాలులను తట్టుకొని సైనికులు ఉండాల్సి ఉంటుంది. మైనస్ 5 నుండి మైనస్ 30డిగ్రీల వాతావరణం ఉంటుంది.ఒక్క పిలుపు వచ్చిన వెంటనే సరిహద్దు రేఖ వద్ద యుద్ధానికి రెడీ అయ్యేలా సైనికులకు ఏర్పాట్లు చేస్తూనే… వారిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఆర్మీ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక అక్కడ రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతూనే ఉంటుంది.
ఈ తరుణంలోనే మన ఆర్మీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటి అంటే సైన్యానికి వింటర్ డీజల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అసలు వింటర్ డీజల్ అంటే ఏమిటి , దీన్ని ఎక్కడ వాడతారు అంటే , లే-లడఖ్‌లో సైనిక సిబ్బంది విధి చాలా కష్టం. కదలిక మైనస్ 30-డిగ్రీల ఉష్ణోగ్రతలో అవుతుంది.ఈ వణుకుతున్న చలిలో, సాధారణ డీజిల్ కూడా పనిచేయడం మానేస్తుంది మరియు అది స్తంభింపచేయడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితిలో, సైనికుల కదలిక కష్టం అవుతుంది. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆర్మీ సిబ్బందిని ఈ సమస్య నుండి ఉపశమనం కోసం భారత సైన్యం కోసం ప్రత్యేక డీజిల్ తెచ్చింది. దీనిని వింటర్ డీజిల్ అంటారు. వింటర్ డీజిల్ వాడకాన్ని అనుమతించాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఇండియన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ను కోరింది. ఈ డీజిల్ మైనస్ 30-డిగ్రీల ఉష్ణోగ్రతలలో కూడా పనిచేస్తుందని IOC తెలిపింది.వింటర్ డీజిల్ ఒక ప్రత్యేకమైన ఇంధనం. తీరప్రాంతంలో ఎత్తైన ప్రదేశాలలో వాడటానికి దీనిని ఐఓసి గత సంవత్సరం అభివృద్ధి చేసింది. ఈ ప్రాంతాల్లో, పాదరసం సున్నా నుండి 20 నుండి 30 డిగ్రీల వరకు పడిపోయినప్పుడు, సాధారణ డీజిల్ ప్రవాహం ఆగిపోతుంది. ఎన్నిరోజుల పాటు వింటర్ లో DHPP - W అనే ప్రత్యేక ఇంధనాన్ని వాడేవారు. ఇప్పుడు ఆ స్థానంలో వింటర్ డీజల్ ను ఉపయోగించబోతున్నారు.