కిరణ్ బేడిని తప్పించడానికి కారణాలు అవేనా?
కిరణ్ బేడి.దేశంలోనే తొలి ఐపీఎస్. అలాంటి స్టిక్ట్ ఆఫీసర్ తొలుత ఆమ్ ఆద్మీలో ఓ వెలుగు వెలిగారు. అనంతరం విభేదాలతో బయటకు వచ్చి కమలదళంలో చేరి ఢిల్లీ బీజేపీ సీఎం క్యాండిడేట్ గా నిలబడ్డారు. రాజకీయంగా ఆమె దురుసు ప్రవర్తనతో లక్ష్యం చేరుకోలేదు. అయితే ఢిల్లీ బీజేపీ సీఎం క్యాండిడేట్ గా ఓడిపోవడంతో కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఆమెను పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా పంపింది.
పోలీస్ ఆఫీసర్ గా స్టిక్ట్ గా పనిచేసిన ఆమె ఇప్పుడు రాజకీయాల్లోనూ అలానే పనిచేసి వివాదాలకు ఆజ్యం పోశారు. బీజేపీ ఆమెకు అప్పగించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఆమె విఫలమయ్యారు.
పాండిచ్చేరిలో కొలువుదీరిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి నారాయణ స్వామి తప్పులను ఎత్తిచూపాలని కిరణ్ బేడికి ఆదేశాలు ఇవ్వగా.. ఆమె రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకొని నారాయణ స్వామికి ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేశారని బీజేపీ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది.
లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కిరణ్ బేడిని తప్పించాలని సీఎం నారాయణ స్వామి ఐదేళ్లుగా పోరాడుతున్నారు. నిరసన దీక్ష కూడా చేశాడు. తాజాగా ఆమెను సడెన్ గా కేంద్రం లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించింది. దీని వెనుక మూడు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో జరిగే పాండిచ్చేరి ఎన్నికల నేపథ్యంలోనే కిరణ్ బేడి ఉంటే బీజేపీకి తీవ్ర నష్టం అని బీజేపీ భావించింది. ఆమె వల్ల బీజేపీకి డ్యామేజ్ జరిగి కాంగ్రెస్ సీఎం నారాయణ స్వామికి లాభమైంది. ఈ క్రమంలోనే ఫక్తు రాజకీయవేత్తను కిరణ్ బేడి స్థానంలో నియమించాలని బీజేపీ భావిస్తోంది. హంగ్ వస్తే బీజేపీ ప్రభుత్వం నిలబడేలా కేంద్రం చక్రం తిప్పుతోంది.
ఇక పాండిచ్చేరిలో బలమైన కాంగ్రెస్ తో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఆ పార్టీ నేత, మాజీ సీఎం ఎన్ రంగస్వామి ప్రధాన డిమాండ్ కిరణ్ బేడికి ఉద్వాసన పలకాలనే.దీనివల్లనే ఆమెను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ వైఫల్యాలను వెలుగులోకి తేవాలని కిరణ్ బేడిని పాండిచ్చేరి గవర్నర్ గా నియమిస్తే ఆమె ఆ పనిని పక్కనపెట్టి ప్రభుత్వంలో జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై ప్రజల్లో సానుభూతిని కల్పించారని బీజేపీ భావించింది. ఇలా మూడు కారణాలే కిరణ్ బేడి తొలగింపునకు కారణంగా రాజకీయవర్గాలు అంచనావేస్తున్నాయి.