మిస్సైల్ మ్యాన్ కలాం ఇకలేరు!

Update: 2015-07-27 15:54 GMT
మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం(84) గుండెపోటుతో మరణించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లోని ఇండియన్ ఇన్ స్ట్యూట్ ఇఫ్ మేనేజ్ మెంట్ లో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో వెంటనే షిల్లాంగ్ లోని బెథాని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఆర్మీ డాక్టర్లు వైద్యం చేసినా లాభం లేకపోయింది. ఆయన మరణించడం విద్యార్థిలోకంతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలచివేసింది. ఎప్పుడూ చిన్నారులతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ వుండే కలాం ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. 

తమిళనాడులోని రామేశ్వరంలో 1931 సంవత్సరం అక్టోబరు 31న జన్మించారు. భారతరాష్ట్రపతిగా 2002-2007 వరకు పనిచేశారు. అంతకుముందు ఓ శాస్త్రవేత్తగా భారత రక్షణ రంగానికి అనేక సేవలు అందించారు. ఓ వైపు శాస్త్రవేత్తగా సేవలు అందిస్తూనే... మరోవైపు అనేక పుస్తకాలు రాశారాయన. భారతరత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్ లాంటి బిరుదలతో భారత ప్రభుత్వం సన్మానించింది.
Tags:    

Similar News