ఆ డాక్టర్ చేస్తున్న చెత్త పని తెలిసి తాట తీసిన మంత్రి రజనీ

Update: 2022-09-04 05:38 GMT
ఒక ప్రభుత్వ వైద్యుడి చెత్త పనులు తెలిసిన మంత్రి రజనీ సీరియస్ గా రియాక్టు అయ్యారు. అక్కడికక్కడే సస్పెండ్ చేసేసి.. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభుత్వ వైద్యుడి లీలల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. తాజాగా బాపట్ల జిల్లాలోని బల్లికురవ ప్రాంతానికి తనిఖీ కోసం వచ్చారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడుదల రజని.

అక్కడ విధులు నిర్వర్తించాల్సిన వైద్యధికారి భానుప్రకాశ్ అక్కడ అందుబాటులో లేకపోవటంతో షాక్ తిన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లీలల గురించి గ్రామస్తులు చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బల్లికురవలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించాల్సి ఉన్నప్పటికీ.. అతడు మాత్రం మార్టూరులోని తన ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తారన్న విషయాన్ని తెలుసుకున్నారు. అయితే.. రోజు ఆసుపత్రికి వచ్చినట్లుగా హాజరు ఉంది కదా? అన్న ప్రశ్నకు.. అసలు గుట్టు బయటకు వచ్చింది.

తన సిబ్బంది సాయంతో కృత్రిమ వేలిముద్ర (చర్మంతో తయారు చేయించారు)ను మూడు పూటల హాజరు వేయిస్తంటారు. తనకు తోచినప్పుడు వెళుతుంటారు. అంతేకాదు.. సిబ్బందితో కలిసి ఆసుపత్రిలో కలిసి మద్యం సేవించటంతో పాటు.. మహిళా సిబ్బందితో అసభ్యంగా మాట్లాడుతూ వారికి సంబంధం లేకున్నా వీడియో కాల్స్ చేస్తుంటారంటూ అతడి చెత్త పనుల భాగోతాల్ని బయపెట్టారు. దీంతో.. తీవ్ర అసహనానికి గురైన ఆమె.. వెంటనే భానుప్రకాశ్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒక వైద్యుడిగా ఉంటూ ఇంత దారుణంగా వ్యవహరించటమా? అని ఈ వివరాలు తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి.
Tags:    

Similar News