• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కోడెల‌కు ఊర‌ట‌తో కూడిన...

కోడెల‌కు ఊర‌ట‌తో కూడిన షాకులు

By - Tupaki Desk
Update: 2019-08-31 08:55 GMT
గత కొన్ని రోజులుగా వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా మారిన టీడీపీ సీనియ‌ర్ నేత‌ - మాజీ స్పీక‌ర్‌ కోడెల శివ‌ప్ర‌సాద్ రావుకు ఊర‌ట‌తో కూడిన షాక్ త‌గిలింది. ఆయన కూతురు, కొడుకుపై నమోదవుతున్న భారీగా కేసుల ప‌రంప‌ర‌కు తోడుగా హైదరాబాద్‌ లో అసెంబ్లీ నుంచి అమరావతికి తరలించాల్సిన సామగ్రిని తన సొంత ఇంటికి - తన కుమారుడి షోరూమ్‌ కి తరలించారని ఆరోపణలు ఆయ‌న ప‌రువు తీసేశాయి. ఓ స్పీకర్‌ గా పనిచేసిన ఆయన ఇలా కుర్చీలు - బెంచీలు - సోఫాలు - డైనింగ్ టేబుల్స్ ఇంటికి తీసుకుని వెళ్లడం రాజకీయాల్లో పెనుదుమారానికి దారితీసింది. ఆఫీసులో స్థలం లేకపోవడం వల్ల తన వద్ద భద్రపరిచానని - కావాలంటే తీసుకుని వెళ్లొచ్చని కూడా చెప్పారు. ఇలా వరుస వివాదాలు - రాజకీయ విమర్శలు - ఆరోపణలతో కొద్దిరోజులుగా కోడెల ఉక్కిరిబిక్కిరవుతుండ‌గా తాజా ఓ ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. `కే ట్యాక్స్`  వ‌సూళ్ల విష‌యంలో హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది.

హైకోర్టు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ - ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోడెల కుటుంబ సభ్యులపై సత్తెనపల్లి - నరసరావు పేట పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఐదు కేసుల్లోనూ వారిద్దరికీ బెయిల్ మంజూరైంది. అయితే, కోర్టు ప‌లు ష‌ర‌తులు విధించింది. సెప్టెంబర్ ఆరో తేదీలోగా కోర్టుకు వెళ్లి లొంగిపోవాలని - అదే సమయంలో బెయిల్ కూడా లభిస్తుందని కోర్టు పేర్కొంది. విజయవాడను వీడి వారు బయటకు వెళ్లకూడదని - ప్రతి సోమ - బుధ - శనివారాల్లో ఆ కేసుల విచారణ కోసం పోలీసుల ముందుకు వెళ్లాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. విచార‌ణ‌లో పోలీసుల‌కు పూర్తిగా అందుబాటులో ఉండాల‌ని కోరింది.

కాగా, కోడెల కుటుంబం నరసరావుపేట - సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పేదల నుంచి బడా కాంట్రాక్టర్‌ వరకూ ప్రతి ఒక్కరి నుంచి కే–ట్యాక్స్‌ రూపంలో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ల్యాండ్‌ కన్వర్షన్ల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. కోడెల కుటుంబం అక్రమాలు సత్తెనపల్లి - నరసరావుపేట నియోజవకర్గాలను దాటాయ‌ని సైతం ప్ర‌చారం జ‌రిగింది. ఆ కేసులోనే కోడెల ప్ర‌స్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.


Tags:    
  • AP High Court 
  • Kodela Sivaprasadarao 
  • Son 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS