సీఐడీ పోలీసుల స్వామిభక్తిపై హైకోర్టు ఆగ్రహం!!
ప్రముఖ తెలుగు వెబ్ న్యూస్ చానెల్ ఎండీ కే రవిశంకర్ పై మంగళగిరి సీఐడీ ఠాణా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఈ కేసును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వెబ్ న్యూస్ చానెల్ నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రిని వెనక్కి ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.
సీఎం జగన్ పైన.. ప్రభుత్వంపైన అభ్యంతరకంగా ఆ వెబ్ న్యూస్ చానెల్ ఒక వార్తను యూట్యూబ్ లో చూశానని.. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పి.జగదీష్ అనే వ్యక్తి సీఐడీ అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళగిరి సీఐడీ పోలీసులు సదురు న్యూస్ చానెల్ ఎండీ కే రవిశంకర్ పై కేసు నమోదు చేశారు.
కాగా ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ రవిశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ పోలీసుల తీరును తప్పుపడుతూ తీర్పు ఇచ్చింది.
సీఐడీ పోలీసుల అత్యుత్సాహం చూస్తుంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని సంతృప్తి పరచడానికి చేసినట్లుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయాలని.. పక్షపాతంతో ప్రజలను వేధింపులకు గురిచేయడం అరాచకత్వానికి దారితీస్తుందని వ్యాఖ్యానించింది. జీవించే హక్కు, స్వేచ్ఛ ప్రతిష్టకు నష్టం కలిగే తీవ్ర పర్యవసనాలకు ఇది దారితీస్తుందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
యూట్యూబ్ పోస్టింగ్ లో కేవలం ప్రభుత్వాన్ని, సీఎంపై ఆరోపణలు మాత్రమే చేశారని దానిపై 505(2) సెక్షన్ కింద కేసు ఎలా నమోదు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు కేసు ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.