ఏపీ సర్కారు కీలకనిర్ణయం.. దీపావళి వేళ ఆ రెండు గంటలే కాల్చాలి

Update: 2020-11-11 06:30 GMT
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఓవైపు కరోనా..మరోవైపు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల నేపథ్యంలో దీపావళి వేళ.. టపాసులు ఎప్పుడు కాల్చాలన్న అంశంపై తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టపాసులు పెద్ద ఎత్తున కాలిస్తే.. వాయు కాలుష్యంతో పాటు.. కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంతో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

బాణ సంచాను కాల్చే దీపావళి రాత్రివేళ.. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని నిర్ణయించారు. అంతేకాదు.. గ్రీన్ టపాసులు మాత్రమే కాల్చాలని పేర్కొన్నారు.

దీపావళి సందర్భంగా అమ్మే టపాసుల షాపుల విషయంలోనూ కచ్ఛితమైన ఆదేశాలు జారీ చేశారు. షాపుల్లో కొనుగోలు దారుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. దీపావళి సామాన్లు అమ్మే వద్ద శానిటైజర్లను వాడొద్దని పేర్కొన్నారు. అంతేకాదు.. టపాసులు కొనే ముందు.. తర్వాత.. శానిటైజర్లను వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. అసలు వాడకూడదని చెబుతున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తిప్పలు తప్పవని చెబుతున్నారు.
Tags:    

Similar News