వైరల్ గా ఈ లెక్కలు.. సీఎం జగన్ వింటే బాగుంటుందట!
'నేను విన్నా.. నేను చూశా'.. అంటూ రొడ్డు కొట్టుడు మాటలకు భిన్నంగా.. చెప్పిన మాటలు చిన్నవే కావొచ్చు. కానీ వాటి ప్రభావం ఎంతన్న విషయం అందరికి తెలిసిందే. విపక్ష నేతగా ఉన్న వేళ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కానీ.. ఆ సందర్భంగా తాను ఇచ్చిన హామీలు.. వాటి అమలు ఎలా చేయగలమన్న విషయాన్ని వివరించే తీరు చూసిన వారంతా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. జగన్ చేతికి అధికారం ఇస్తే.. ఆయనే అన్ని చూసుకుంటారన్న భావనకు వచ్చారు. దీనికి ప్రతిరూపమే.. 151 సీట్ల చారిత్రక విజయం.
కట్ చూస్తే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడేళ్లు దాటిపోయింది. మాటలకు.. చేతలకు మధ్య తేడా ప్రజలకు అర్థమవుతోంది. మాట మీద నిలబడతానన్న మాటకు అర్థం ఇదేనా? అంటూ నిరుద్యోగులు గళం విప్పుతున్నారు. చేతికి ఎముక లేదని అందరూ చెబుతుంటారు.. మీకు అన్యాయం చేయనంటూ అనునయంగా చెప్పే జగన్ మాటల్ని విన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తమకు మేలు జరుగుతుందని బోలెడంత సంతోషానికి గురయ్యారు. 40 శాతం అడిగిన పీఆర్సీని కనీసం35 శాతం పెంచితే.. తమకు కొంతమేర అయిన ఊరట కలుగుతుందని భావించారు.
అందుకు భిన్నంగా జగన్ మాత్రం 23.29 శాతం పీఆర్సీని ప్రకటించారు. ఆయన ప్రకటన సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు చప్పట్లతో మారుమోగించారు. అయితే.. ఈ ప్రకటన విన్న ప్రభుత్వ ఉద్యోగుల ముఖాల్లో నెత్తురుచుక్క లేదు. తాము పంపిన తమ నేతలు ఎందుకు చప్పట్లు కొడుతున్నారన్న ప్రశ్నను ఇప్పుడు సంధిస్తున్నారు. సీఎంతో సమావేశమైన నేతలు ఎవరు కనిపించినా.. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. 'మీరు ఎదురు మాట్లాడటం కష్టం కావొచ్చు. ప్రశ్నించే పరిస్థితి లేకపోవచ్చు. కానీ.. ఆ చప్పట్లేంది? ఆ ఉత్సాహం ఏమిటి? ఏం ఇచ్చారని మీరంత సంతోషాన్ని ప్రదర్శించారు?'' అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.
అదేండండి.. సీఎం జగన్ అంత పెద్ద మనసుతో 23.29 శాతం పీఆర్సీని పెంచిన తర్వాత కూడా ఈ మాటలేంది? ప్రభుత్వ ఉద్యోగుల ఆశకు హద్దు ఉండదన్న వ్యాఖ్యలు చేస్తే.. తప్పులో కాలేసినట్లే. లెక్కలు తెలీకుండా.. నోటికి వచ్చినట్లు మాట్లాడినట్లు అవుతుంది. ఎందుకంటే.. రూ.40వేల బేసిక్ ఉన్న ఉద్యోగికి జీతం.. తాజాగా జగన్ సర్కారు ప్రకటించిన 23.29 శాతంపీఆర్సీని పరిగణలోకి తీసుకుంటే పెరిగేమొత్తం దగ్గర దగ్గర వెయ్యి మాత్రమే. మహా అయితే.. మరో రెండు.. మూడు వందలు మాత్రమే పెరుగుతుంది. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇప్పుడు మరింత ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఇంతకాలం హెచ్ఆర్ఏను లెక్కిస్తున్న విధానానికి భిన్నంగా జగన్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. ఒకవేళ.. దాన్నే అమలు చేస్తే.. ఇప్పుడు వచ్చే జీతంలో మూడు.. నాలుగు వేల రూపాయిలు కోత పడినా ఆశ్చర్యం లేదంటున్నారు.
అదే జరిగితే.. హెచ్ఆర్ కింద పోయేది నాలుగు వేలు అయితే.. పెంచిన వెయ్యిని అందులో మినహాయిస్తే.. మొత్తంగా నికర నష్టం రూ.3వేలు అవుతుంది. అంటే.. జీతం పెరగకుండానే రూ.3వేల వరకునష్టపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో మరికొందరు మరింత లోతుల్లోకి వెళ్లి కచ్ఛితమైన లెక్కలు తీస్తున్నారు. అలాంటి వారైతే.. తమ జీతం రూ.వెయ్యి పెరగటం కాదు.. రూ.1600 తగ్గుతుందని. ఆ లెక్క మరింత ఆసక్తికరంగా మారింది.
ఇక.. ముందు చెప్పినట్లు హెచ్ఆర్ఏ మీద ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయని వేళ.. దాని మీద చేసే విశ్లేషణ ఏదైనా తప్పే అవుతుంది. దాన్ని పక్కన పెట్టేసి.. సీఎం జగన్ ప్రకటించిన 23.29 పీఆర్సీ లెక్కల్లోకే వెళదాం. రూ.40వేల బేసిక్ జీతగాడి విషయంలో ఏం జరుగుతుందో అన్న దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున లెక్కల్ని వేసి చూపిస్తున్నారు. వారు చెబుతున్న లెక్కల్ని చూస్తే.. సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీతో లాభం కాదు నష్టమే అవుతుందని. అదెలా అనే దానికి వారు వినిపిస్తున్న లెక్కలు ఇలా ఉన్నాయి.
1. ఒక ఉద్యోగికి బేసిక్ రూ.40వేలు. ప్రస్తుతం తీసుకుంటున్న లెక్కలోకి వెళితే..
బేసిక్ పే 40000
డీఏ.33.536%. 13414
ఐఆర్ .27% 10800
మొత్తం రూ.64,214
2. పీఆర్సీతో సంబంధం లేకుండా డీఏలు అన్ని ఇస్తే సదరు ఉద్యోగికి వచ్చేది..
బేసిక్ పే 40000
డీఏ.53.448% 21379
ఐఆర్.27% 10800
మొత్తం రూ. 72179
3. ఇవ్వాల్సిన డీఏలు ఇస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన 23% శాతం ఫిట్మెంట్ ప్రకారం ఇస్తే వచ్చేది..
బేసిక్ 40000
డీఏలన్ని 53.448% 21379
పీఆర్సీ 23% 9200
మొత్తం రూ.70579
ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నది నీవు ప్రస్తుతం తీసుకుంటుంది.64214. పీఆర్సీ.. డీఏలు ఇవ్వటం వలన నీ జీతం.70579 అవుతుంది. అంటే అంతకముందుకంటే నీజీతం (70579-64214= 6365) రూ.6365 పెరుగుతుందని. అయితే.. ఇక్కడే మతలబు ఉంది. వాస్తవంగా ఇవ్వాల్సిన పీఆర్సీ ఇవ్వకుండా.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు అన్ని ఇస్తే.. ఉద్యోగులు తీసుకునేది రూ.72,179. ఒకవేళ పీఆర్సీ.. డీఏలు ఇచ్చినా ప్రభుత్వంఇచ్చేది రూ. 70579. కానీ.. పీఆర్సీ ఇవ్వటంతో వచ్చే నష్టం ఉంది అదెలానంటే.. 72179-70579=1600. మరి.. ప్రభుత్వం ఉద్యోగులకు మేలు కలిగించిందని చెబుతుంటే.. వాస్తవం మాత్రం నష్టం జరుగుతుందన్న ఈ లెక్కలపై ప్రభుత్వం వివరంగా ప్రకటన విడుదల చేస్తే మంచిదన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.