సెక్స్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం ఉచిత రేషన్ !
కరోనా మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచంలోని ప్రతిఒక్కరి జీవితం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. సామాన్యుల నుండి పారిశ్రామిక వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ స్థాయిలో భారీ నష్టాన్ని చవిచుసారు. కరోనా వైరస్ కారణంగా సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎన్జీవో స్పందించింది. వారి సమస్యలపై సుప్రీంకోర్టులో ఎన్జీవో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారించిన అనంతరం సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. గుర్తింపు కోసం ఎటువంటి రుజువును నొక్కిచెప్పకుండా సెక్స్ వర్కర్లకు డ్రై రేషన్ అందించేలా చూడాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. నాకో, రాష్ట్ర కమిటీలు గుర్తించిన సెక్స్ వర్కర్లకు ఈ ప్రయోజనం ఇస్తామని కోర్టు తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న బాధపై సుప్రీంకోర్టులో ఎన్జీవో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు రాష్ట్రాలకు పలు ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీం ఇచ్చిన ఆదేశాలకు రాష్ట్రంలోని సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించనుంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్, లీగల్ ఆర్గనైజేషన్లు గుర్తించిన సెక్స్ వర్కర్లకు రేషన్ పంపిణీ చేయడంతోపాటు ఆ వివరాలను తమకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారంగా నవంబర్ నెల రేషన్ అందజేయనుంది. చౌకధరల దుకాణాలు, అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రంలో 1.22 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గుర్తించింది. వీరిలో హోమో సెక్సువల్స్‌తోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఎంత రేషన్ ఇస్తోందో అంతే మొత్తంలో పంపిణీ చేయనుంది.