23న తిరుమలకు సీఎం జగన్.. కారణమిదే?

Update: 2020-09-12 06:45 GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 23న తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు సీఎం జగన్ తిరుమలలోనే ఉండనున్నారు. జగన్ తోపాటు తిరుమలకు కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా వస్తున్నారు.

23న తిరుమల చేరుకోనున్న జగన్.. గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 24న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.  అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా తిరుమలలో కర్ణాటక అతిథిగృహం శంకుస్థాపనలో సీఎం జగన్, యడ్యూరప్పలు పాల్గొననున్నారు. తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహం కు చేరుకొని అల్పాహారం స్వీకరించి జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

ప్రతీఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గరుడ సేవ రోజు సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందుకే జగన్ ఈ వేడుకకు హాజరు అవుతున్నారు.
Tags:    

Similar News