కామ్రేడ్ నారాయణ చెప్పింది నిజమైంది.. ఏపీ చీఫ్ జస్టిస్ బదిలీ?
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు సీపీఐ నారాయణ. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఏపీ చీఫ్ జస్టిస్ ను బదిలీ చేయటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రోజు తిరిగేసరికి ఏపీ చీఫ్ జస్టిస్ తో పాటు.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజే కూడా బదిలీ కావటం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు సీజేలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మరో ఐదారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు స్థానచలనం కలగనున్నట్లుగా తెలుస్తోంది. అదేసమయంలో ఏడెనిమిది మంది హైకోర్టు న్యాయమూర్తులను కూడా బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
ఢిల్లీలో ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు హైకోర్టు సీజేలను బదిలీ చేయాలని తీర్మానించినట్లుగా తెలుస్తోంది. బదిలీ చేసిన సీజేల స్థానంలో అత్యంత సీనియర్లను నియమించనున్నట్లు చెబుతున్నారు. ఇక.. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. బాగా సీనియర్లను కొత్త సీజేలుగా నియమించే వీలుంది.
అవసరానికి అనుగుణంగా తాత్కాలిక సీజే బాధ్యతలు నిర్వహించే స్థాయిలో ఉన్న వారికి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. త్వరలో సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులయ్యే అర్హతులున్న జడ్జిలను తెలుగు రాష్ట్రాలకు పంపనున్నట్లుగా సమాచారం. ఈ బదిలీలకు సంబంధించిన అధికారిక సమాచారం గురు..శుక్రవారాల్లో వెల్లడవుతుందని చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల సీజేలు నియమితులై ఏడాదిన్నర కాలమే అయ్యింది. అయినప్పటికీ వీరిద్దరిని బదిలీపై పంపటం ఆసక్తికర చర్చకు తెర తీస్తోంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గత ఏడాది జూన్ 23న పదవీ బాధ్యతలు చేపడితే.. ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబరు ఏడున బాధ్యతలు స్వీకరించారు. ఇలా.. ఇరువురు సీజేలు ఏడాదిన్నర సమయంలోనే బదిలీతో వెళ్లిపోవటం ఆసక్తికర చర్చకు తెర తీసింది.