మహమ్మారి బారిన మరో వైసీపీ ఎమ్మెల్యే
కరోనా మహమ్మారి విజృంభణకు సామాన్యులే కాదు.. ప్రజా ప్రతినిధులు కూడా బాధితులుగా మారుతున్నారు. వరుస బెట్టి వైరస్ బారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా సోకగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి కూడా ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఇంకా తగ్గలేదు. కాగా ఏపీలో కొద్ది రోజుల కిందట కరోనా కేసుల నమోదు సంఖ్య తగ్గినప్పటికీ ప్రస్తుతం మళ్లీ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా నమోదయిన కేసులతో రాష్ట్రంలోకరోనా కేసుల సంఖ్య 84.29 లక్షలు దాటడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. వైసీపీలో కరోనా బాధితుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది.
ఇటీవలే ఎంపీలు విజయసాయిరెడ్డి, రెడ్డెప్ప, మంత్రి పెద్ది రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవి రెడ్డి, మధుసూదన రెడ్డి బారినపడి కోలుకోగా తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వైసీపీ కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వర్ రావు వైరస్ బారిన పడ్డారు. కొద్ది రోజులుగా ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. వైరస్ లక్షణాలు కనిపించగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో పాజిటివ్ తేలింది. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇటీవలికాలంలో తనను కలిసిన వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నాగేశ్వరరావు కోరారు. కాగా వరుసబెట్టి ప్రజాప్రతినిధులందరూ వైరస్ బారిన పడుతుండటంతో వైసీపీలో ఆందోళన నెలకొంది.