శామీర్ పేట్ చిన్నారి మృతి కేసులో మరో ట్విస్ట్ !
హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన జరిగింది. ఈ నెల 15వ తేదీన ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. కిడ్నాప్ చేసిన వ్యక్తి బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇస్తేనే పిల్లాడు తిరిగి ఇంటికి వస్తాడని బెదిరించాడు. అయితే , ఆ బాలుడి తండ్రి ఆటో డ్రవర్ కావడంతో అంత మొత్తం ఇచ్చుకోలేనని ఎంత ప్రాధేయపడినా ఆగంతకుడు వినిపించుకోలేదు. దాంతో ఆందోళన చెందిన తండ్రి స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు పై పలు రకాలుగా దర్యాప్తు చేస్తున్న సమయంలో కిడ్రాప్ కు గురైన బాలుడు ఇటీవల శవమై కనిపించాడు. ఆ తర్వాత ఈ కేసులో వేగం పెంచిన పోలీసులు అసలు విషయాన్ని బయట పెట్టారు.
షేర్ చాట్లో స్కిట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ బాలుడు మృతి చెందినట్లు పోలిసుల విచారణలో వెల్లడైంది.ఆ తర్వాత , బాలుడి మృతిని నిందితుడైన బిహార్ యువకుడు సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. భయంతో చిన్నారి డెడ్ బాడీని మూట కట్టి అక్కడినుంచి షిఫ్ట్ చేశాడు. డెడ్ బాడీని పడేసి వచ్చిన తర్వాత, బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. 15 లక్షల రూపాయలను పంపాలని అడిగాడు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడ్ని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం విచారణ ప్రారంభించారు. ఔటర్ రింగు రోడ్డులో పడేసిన బాలుడి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.