కోలుకున్నా వదలదు..మహమ్మారి తెచ్చిన మరో సమస్య
కరోనా మహమ్మారి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కన్ను మూశారు. చాలా మంది వైరస్ బారిన పడి కోలుకున్నా వారికి ఏదో ఒక కొత్త సమస్య తలెత్తుతోంది. వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు మహమ్మారి వల్ల వస్తున్న సమస్యలను తమ పరిశోధనల ద్వారా వెళ్ళడిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా బాధితులకు మరో కొత్త సమస్య వేధిస్తున్నదట. ఇటీవల బయటకొచ్చిన ఓ అధ్యయనం ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారు చర్మవ్యాధులకు గురవుతున్నారట. యూరోపియన్ అకాడమీకి చెందిన చర్మ, లైంగిక వ్యాధుల నిపుణులు యూఎస్‌లోని మస్సాచుసెట్స్ జనరల్ ఆసుప్రతిలో ఇటీవల జరిగిన 29వ కాంగ్రెస్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
పరిశోధకులు 1000 కేసులను పరిగణనలోకి తీసుకున్నారు. 39 దేశాలకు చెందిన 224 అనుమానితులను పరీక్షించారు. వీరందరికీ కరోనా వచ్చినప్పుడు కొన్ని రకాల చర్మవ్యాధులు వచ్చినట్టు నిపుణులు గుర్తించారు. వైద్య పరిభాషలో దీన్ని 'కొవిడ్ టోస్'గా దీన్ని వ్యవహరిస్తున్నారు. కోవిడ్ రోగుల్లో కాళ్లు, చేతులు ఎరుపెక్కడం, వాపు రావడం తదితర లక్షణాలు వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ డెర్మటాలజీ సొసైటీస్, అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ సహకారంతో ఈ పరిశోధనలు సాగించారు వైద్యనిపుణులు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకోని వాళ్లు కొవిడ్ వల్ల వచ్చిన చర్మ వ్యాధులతో కనీసం 60 రోజులు పాటు బాధపడినట్లు పరిశోధకుల బృందం తెలిపింది.