బాబూ కావాలీ.. జగనూ కావాలి...?
అవ్వా కావాలి బువ్వా కావాలి అని వెనకటి ఒక గడసరి కోరారట. అలా ఉంది కేంద్రంలోని బీజేపీ పెద్దల అతి తెలివి. ఏపీలో ఉప్పూ నిప్పులా ఉన్న వైసీపీ టీడీపీలతో కేంద్ర పెద్దలు రాజకీయ క్రీడకు తెర తీశారు. తమ వైపు నుంచి మాత్రమే వారు చూసుకుంటూ వస్తున్నారు. అందుకే ఏపీలో రెండు బడా పార్టీల అధినేతలను చాలా సులువుగా బుట్టలో వేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.
రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు అని అంటారు. కానీ ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే జగన్ చంద్రబాబు ఇద్దరూ కూడా గత ఎనిమిదేళ్లుగా మోడీ అనే ఒరలో చాలా బాగానే ఇమిడిపోయారు. జగన్ విపక్ష నేతగా ఉన్నప్పటి సంగతే గుర్తు తెచ్చుకుంటే ఆయన మోడీని కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా ఎంతసేపూ చంద్రబాబు మీదనే విమర్శలు చేస్తూ వచ్చారు.
ఇక ఆనాడు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మోడీతో జగన్ కి అపాయింట్మెంట్ కూడా ఉండేది. అది టీడీపీకి మంటెక్కేది. చివరికి చంద్రబాబు ఎన్డీయే నుంచి వేరు పడడానికి అది కూడా ఒక కారణం అంటారు. ఇక సీన్ మారింది జగన్ సీఎం అయ్యారు. మూడేళ్ళుగా బాబుని దూరం పెట్టిన బీజేపీ ఇపుడు ఆయనతో నవ్వులు చిందిస్తోంది. మోడీలో బాబు కలసిన లేటెస్ట్ ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి.
ఇది నిజంగా టీడీపీకి సంబరమే. అయితే వైసీపీ మాత్రం దీని మీద మంటగా ఉంటోంది. అపుడే వైసీపీ కీలక నేతలు సజ్జల రామక్రిష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి బాబు మోడీ భేటీ మీద అంత సీన్ లేదని అంటూ తేల్చేశారు. బాబుది ఫక్తు స్వార్ధమని కూడా వారు విమర్శించారు. ఇక వైసీపీ మంటను అర్ధం చేసుకున్నట్లుగా కేంద్ర పెద్దలు కూడా బ్యాలెన్స్ చేస్తూ కనిపించారు.
నీతి అయోగ్ మీటింగులో భాగంగా మోడీ జగన్ ని ప్రత్యేకంగా లంచ్ కి ఆహ్వానించారు. ఆయనతో కలసి టేబిల్ ని పంచుకున్నారు. ఇలా జగన్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మోడీ వైసీపీ కూడా తమకు చాలా ముఖ్యమన్న సందేశాన్ని పంపించారు. దీన్ని చూసిన వారికి మాత్రం ఒక విషయం అర్ధం అవుతోంది. ఏపీలో ఉన్న రెండు పార్టీలూ కేంద్రానికి కావాలి. బీజేపీకి చెరో వైపునా బాబు జగన్ ఉండాలి.
ఇది బీజేపీ ఆలోచన అయితే ఏపీలో ఉన్న జగన్ బాబు కానీ బీజేపీ చేయి వీడేందుకు అసలు ఇష్టపడకపోవచ్చు అంటున్నారు. నాడు బాబు జగన్ వేసిన మైండ్ గేమ్ కి చిత్తు అయి ఏకంగా బీజేపీకి తలాక్ అనేశారు. కానీ ఇపుడు జగన్ మాత్రం బాబు ఎత్త్లకు పై ఎత్తులే వేస్తారు తప్ప బీజేపీ చేయిని వీడే సీన్ ఉండదని అంటున్నారు.
అంటే ఇద్దరూ పోటాపోటీగా మోడీ పాటనే పాడుతూ ఉంటారన్న మాట. దీని వల్ల ఏపీకి ఎంత లాభం అని ఎవరూ అడగకూడదు, కానీ వారి వారి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారు. బీజేపీకి కూడా ఈ సంగతి తెలుసు కాబట్టి ఇద్దరినీ కలుపుకుని ఏపీ మాదే అంటోంది. సౌత్ లో ఒక స్టేట్ లో ఫుల్ మెజారిటీ మాదే అని చంకలెగరేస్తోంది.