పవన్ కు భద్రత పెంచిన ఏపీ సర్కార్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సెక్యురిటీ పెరిగింది. గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జనసేన ఆవిర్భావ సభను ఏర్పాటు చేయటం తెలిసిందే.ఈ భారీ బహిరంగ సభ జరగటానికి సరిగ్గా ఒకట్రెండు రోజుల ముందు తనకు భద్రతను పెంచాలని.. తనకున్న అభిమానగణం.. ఫాలోయింగ్ తో పాటు.. తనకున్న భద్రతా పరమైన ఇబ్బందుల కారణంగా తనకు తగినంత సెక్యురిటీని పెంచాలని కోరుతూ ఏపీ సర్కారుకు పవన్ లేఖ రాశారు.
తాజాగా ఏపీ సర్కారు స్పందించింది. పవన్ కల్యాణ్ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. పవన్ కు భద్రతగా ఉండేందుకు నలుగురు గన్ మెన్లను రెండు షిఫ్ట్ ల చొప్పున నియమించింది. ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయటంతోపాటు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కమ్ మంత్రి లోకేశ్ అవినీతిపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. నాడు పవన్ రాసిన లేఖకు నేడు ప్రభుత్వం రియాక్ట్ అయి.. ఆయనకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.
తాజాగా పెరిగిన సెక్యూరిటీ నేపథ్యంలో పవన్ తన రాజకీయ కార్యక్రమాల్ని మరింత ముమ్మరం చేస్తారని చెబుతున్నారు. త్వరలో ఏపీ వ్యాప్తంగా పర్యటించాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పాదయాత్ర చేస్తారన్న ప్రచారం జరుగుతున్నా.. అది సాధ్యం కాదని.. కాకుంటే బస్సు యాత్ర చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. హోదాపై ఆమరణ దీక్ష చేయటం ద్వారా ఎన్నికల వేళ నాటికి ఏపీలో తన ఓటు బ్యాంకును మెరుగుపర్చుకోవాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు.
తన వరుస పర్యటనలతో కేంద్రం నుంచి ఏదో రకంగా సానుకూలంగా ప్రకటనను తీసుకురావాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ. తన ప్రయత్నాలకు మోడీ సర్కారు సానుకూలంగా స్పందించని పక్షంలో.. తాను పోరాడాల్సినంతగా పోరాడిన భావనను ఏపీ ప్రజలకు కలుగజేయటమే లక్ష్యమని చెబుతున్నారు. ఏమైనా. .రానున్న రోజుల్లో పవన్ రాజకీయ హడావుడి భారీగా పెరుగుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.