ఆంధ్రోళ్లు.. ఇలా ఎన్నిసార్లు అడుక్కోవాలో..?
అదేం ఖర్మో అర్థం కాదు. దేశంలో మరే రాష్ట్రానికి లేని శాపం ఆంధ్రోళ్లకే ఉందా? అనిపించే పరిస్థితి. నిజానికి మొదటి నుంచి ఇదే పరిస్థితి. 2004లో కేంద్రంలో యూపీఏ సర్కారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటేనే ఏపీలో గెలిచిన సీట్లు. 2004లోనే కాదు.. 2009లోనూ కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కొలువు తీరటానికి ఏపీ భిక్షే కారణం. కానీ.. అలాంటి ఏపీ పట్ల నాటి కేంద్రం ఎలా వ్యవహరించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
విభజన విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏంటని అడిగితే శూన్యమనే చెప్పాలి. ఏపీకి పెద్దపీట వేస్తూ.. అటు వార్షిక బడ్జెట్ లో కానీ.. ఇటు రైల్వే బడ్జెట్ లో కానీ ఆ పార్టీ ఏమైనా మేలు చేసిందా? అంటే లేదు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏపీ కారణమైనా.. ఏపీ ప్రయోజనాల గురించి సీరియస్ గా పట్టించుకున్న పరిస్థితి కనిపించదు.
వైఎస్ లాంటి ప్రజాకర్షక నేత ముఖ్యమంత్రిగా ఉన్నా.. కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర అరచేతి మందాన పలుకుబడి ఉన్నప్పటికీ.. అది ఏపీ ప్రయోజనాలకు ఉపయోగపడలేదు. మన్మోహన్ అధికారంలో ఉన్న పదేళ్లు.. అడక్కుండా ఇవ్వడం మాట అటుంచితే అడిగినా హ్యండిచ్చింది.
ఆంధ్రోళ్లకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా.. తమకు తోచిన రీతిలో కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీని ముక్కలు చేసేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేసిందనే అనుకుందాం. అలా చేస్తే.. ఏపీకి జరిగే నష్టం గురించి అందరి కంటే ఎక్కువ తెలిసింది కాంగ్రెస్ కే. తాము తీసుకున్న విభజన నిర్ణయం కారణంగా ఏపీ ఎన్ని అవస్థలకు గురి కానుందన్న విషయం తెలిసినప్పుడు.. అలాంటివి ఎదురుకాకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదన్నది ఒక ప్రశ్న. కాంగ్రెస్ పార్టీది అదో నిర్లక్ష్యమైతే.. తమ చేతిలో పవర్ ఉన్నప్పుడు ఏపీని ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఏపీ గురించి ఆవేదనను వ్యక్తం చేయటం గమనార్హం.
కాంగ్రెస్ తీరు ఈ రీతిలో ఉంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు ఏపీ అస్సలు పట్టటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో తమకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ అవసరం మోడీకి ఉండకపోవచ్చు. కానీ.. ఎన్నికల సమయంలో ఏపీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని తెలుగువాళ్లు ఎవరూ మర్చిపోలేదు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో తప్పుల మీద తప్పులు చేస్తున్న కేంద్రానికి మేలుకొలుపుగా.. ఏపీ సర్కారు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలన్నది ఆ విన్నపం అసలు ఉద్దేశం. అసెంబ్లీ తీర్మానం చేసినా కేంద్రం పట్టించుకుంటుందా? అన్నది ఒక ప్రశ్న. ఏపీ ప్రజల కంటితుడుపు కోసమన్నట్లు కాకుండా.. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ అధికారపక్షం సీరియస్ అవ్సాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటివేమీ కనిపించని దుస్థితి. చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కులు.. అడుక్కుంటున్నా తీరకపోవడం ఏపీ దుస్థితిని చెబుతున్నాయి.
రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సభ ఏకగ్రీవంగా థ్యాంక్స్ తెలియజేస్తూ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న అన్ని హామీలతో పాటు.. అప్పటి ప్రధాని 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రకటించిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని కోరింది. హక్కుల సాధన కోసం అడిగే మాట ఇంత ముద్దుముద్దుగా ఉంటే.. మోడీ లాంటి వ్యక్తి దాన్ని సీరియస్ గా తీసుకుంటారా..? చూస్తుంటే.. ప్రతి విషయానికి అడుక్కోవటం అలవాటైన ఏపీ సర్కారు తీరు మరికొంత కాలం కొనసాగేటట్లు స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఆంధ్రోళ్లకు ఇంతకుమించిన దురదృష్టకరమైన అంశం ఇంకేం ఉంటుంది? ఇంకా నయం... తీర్మానం అయ్యా ప్రతిపక్ష నేత జగన్ ఇలా అడుక్కుంటే ఏపీకి భవిష్యత్తులో చిప్పే గతి అని చురకవేశారు.