అమరావతిలో ట్రేడ్ సెంటర్ అటకెక్కినట్లేనా?

Update: 2016-04-06 09:55 GMT
నూతన రాజధాని అమరావతిలో రాష్ట్ర వ్యాపారవేత్తలకు ఉపయోగపడేలా ట్రేడ్ సెంటర్ ఏర్పాటు ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించటం లేదని వ్యాపార వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అమరావతికి విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు ఉప్పెనలా వచ్చి భారీ స్ధాయిలో వ్యాపారాలు - పరిశ్రమలు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారని పదే పదే ప్రకటిస్తున్న మంత్రులు స్ధానిక వ్యాపారుల ప్రయోజనాలపై దృష్టి సారించటంలేదని పలువురు అంటున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంవత్సరానికి మూడు పంటలు పండే సుమారు 33వేల ఎకరాల పంట పొలాలు అమరావతి నిర్మాణం కోసం సేకరించారు. అమరావతి భూమిపూజకు ముందు రాష్ట్రం లోని పారిశ్రామిక వేత్తలను దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రత్యేకంగా 500 ఎకరాల  స్ధలం కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత దాని ఊసే ఎత్తటం లేదని స్ధానిక వ్యాపారులు విమర్శిస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న వ్యాపారులను అడ్డంపెట్టుకుని వైసీపీ ప్రభుత్వంపై దండెత్తేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

నూతన రాజధాని పేరు ప్రకటించిన తరువాత పరిశ్రమల స్ధాపనకు వేల ఎకరాలు ఇవిగో అంటూ పదేపదే ప్రకటనలు చేసిన రాష్ట్ర మంత్రులు తర్వాత ఈ విషయాన్ని అటకెక్కించారు. అరచేతిలో సింగపూర్ - జపాన్ వంటి దేశాల్లో ఉన్న పరిశ్రమలు - ట్రేడ్ సెంటర్లను చూపించిన మంత్రులు ఇప్పుడు వాటి ప్రస్ధావనే మరిచారు. శరవేగంతో రాజధాని నిర్మాణం అంటూ తాత్కాలిక భవనాలు నిర్మించేందుకు రంగం సిద్ధమైన తరుణంలో కూడా ట్రేడ్ సెంటర్ ఏర్పాటుపై ఇప్పటివరకు ముఝఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైనా ప్రకటన చేయకపోవటం ఎంతవరకు సమంజమని రాష్ట్రానికి చెందిన వ్యాపార వర్గాలు వారు ప్రశ్నిస్తున్నారు. రాజధాని అమరావతిలో గతంలో ముఖ్యమంత్రి వాగ్ధానం మేరకు వెంటనే ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేసి ఇందుకు అవసరమైనా అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కొందరు వ్యాపారులను ముందు పెట్టి ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. అవకాశం దొరికినపుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉన్న వైసిపికి ట్రేడ్ సెంటర్ అంశాన్ని ఆయుధంగా మార్చుకోవాలనుకుంటుంది.

రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రకాలైనా వ్యాపారస్తులు పన్నుల రూపంలో సంవత్సానికి 30 వేల కోట్లు చెల్లించి ఖజానాకు సహయం అందిస్తున్న నేపధ్యంలో అమరావతిలో ట్రేడ్ సెంటర్కు కనీసం 500 ఎకరాల స్ధలం కేటాయించాలనే కోర్కె సమంజసం - న్యాయసమ్మతమైనదని స్ధానిక వ్యాపారులు అంటున్నారు. ఈ పాయింటును పట్టుకునే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు వైసీపీ రెడీ అవుతున్నట్లుగా సమాచారం.
Tags:    

Similar News