ఏపీకి రాకుండా జగన్ ఢిల్లీలో ఏం చేస్తున్నారో తెలుసా?

Update: 2020-02-15 09:55 GMT
శనివారం ఉదయం ఏపీకి రావాల్సిన ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలోనే ఉండిపోయారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో శుక్రవారం రాత్రి భేటి అయిన జగన్ కీలక మంత్రాంగం నడిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై అమిత్ షాతో చర్చించినట్టు వార్తలొచ్చాయి.

అయితే అమిత్ షా సూచన మేరకు సీఎం జగన్ తన ఏపీ పర్యటనను శనివారం వాయిదా వేసుకోవడం చర్చనీయాంశమైంది. అమిత్ షా తోపాటు ఢిల్లీలోనే ఉండు పలువురు కీలక శాఖ మంత్రులను కలవాలని జగన్ డిసైడ్ అయ్యారు.

అందులో ముఖ్యులు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఏపీకి 3 రాజధానుల ఏర్పాటు, కర్నూలు లో హైకోర్టు సహా ఏపీ శాసన మండలి రద్దు వ్యవహారాలను చూసేది కేంద్ర న్యాయశాఖనే .. అందుకే ఆయనతో భేటిని జగన్ కీలకంగా భావిస్తున్నారు. ఏపీ సమస్యల్లో మెజార్టీ సమస్యలను పరిష్కరించేందుకే న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ను కలువనున్నట్టు సమాచారం..

వీరే కాదు.. జగన్ ఏపీకి రాకుండా శనివారం వీకెండ్ సెలవు కావడంతో ఢిల్లీలోనే ఉన్న పలువురు కీలక కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి రావాల్సిన నిధులు, సమస్యల పరిష్కారానికి కలుస్తాడట.. అలా శనివారం మొత్తం లాబీయింగ్ కోసం జగన్ ఢిల్లీ లో ఉండి  పోయారని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
Tags:    

Similar News