మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా...సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త కొత్త విషయాలు, వైరల్ వీడియోలు, ఫోటోలపై వెంటనే తాను స్పందిస్తూ, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అలాగే పలువురికి సహాయంగా కూడా నిలుస్తూఉంటారు.
తాజాగా, ఆయన షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ... హఫీజ్, హబీబర్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఢిల్లీ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నారు. వారు చెత్తను ఎరుకునే క్రమంలో అలసట తెలియకుండా పాటలు పాడుతూ పనిచేస్తుంటారు. ఈ క్రమంలో వారు ఓ హిందీ పాటను అద్భుతంగా ఆలపించారు. స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు వారు పాడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈ వీడియోలు ఆనంద్ మహీంద్రా కంట పడ్డాయి. వారిద్దరికీ మంచి మెలోడీయస్ వాయిస్ ఉందని ఆయన ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని సంగీత టీచర్లు సాయంత్రం పూట వారికి కొంత సమయం కేటాయించాలని ఆయన కోరారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోలను పోస్ట్ చేయడంతో వారి ప్రతిభ గురించి మరింత మందికి తెలిసింది. కాగా, ఇప్పటికే ఈ వీడియోను పదివేల మందికి పైగా నెటిజన్లు చూశారు. అన్నదమ్ముల దగ్గర టన్నుల కొద్ది ప్రతిభ ఉందని , ఇలాంటి వారికి తప్పకుండా సహకారం అందించాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.Full View Full View Full View
తాజాగా, ఆయన షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ... హఫీజ్, హబీబర్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఢిల్లీ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నారు. వారు చెత్తను ఎరుకునే క్రమంలో అలసట తెలియకుండా పాటలు పాడుతూ పనిచేస్తుంటారు. ఈ క్రమంలో వారు ఓ హిందీ పాటను అద్భుతంగా ఆలపించారు. స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు వారు పాడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈ వీడియోలు ఆనంద్ మహీంద్రా కంట పడ్డాయి. వారిద్దరికీ మంచి మెలోడీయస్ వాయిస్ ఉందని ఆయన ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని సంగీత టీచర్లు సాయంత్రం పూట వారికి కొంత సమయం కేటాయించాలని ఆయన కోరారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోలను పోస్ట్ చేయడంతో వారి ప్రతిభ గురించి మరింత మందికి తెలిసింది. కాగా, ఇప్పటికే ఈ వీడియోను పదివేల మందికి పైగా నెటిజన్లు చూశారు. అన్నదమ్ముల దగ్గర టన్నుల కొద్ది ప్రతిభ ఉందని , ఇలాంటి వారికి తప్పకుండా సహకారం అందించాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.