ఆనంద్ మహీంద్రా తాజా ట్వీట్ ఫజిల్ అదరగొట్టేశారుగా

Update: 2020-11-25 04:45 GMT
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి పుణ్యమా నేటికి కోలుకోలేని దుస్థితి. చాలా దేశాల్లోఇంకా ఫస్ట్ వేవ్ కొనసాగుతుంటే.. పలు దేశాల్లో సెకండ్ వేవ్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాంటి వేళ.. తన ట్వీట్లతో వార్తల్లో ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ట్వీట్ చేసిన ఫజిల్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన.. తాజాగా పోస్టు చేసిన పోస్టులో మీరెక్కడకు వెళ్లాలనుకుంటున్నారు? అంటూ 15 దేశాల జాబితాను ఇచ్చారు. అందులో న్యూజిలాండ్.. మెక్సికో.. కెనడా.. ఇండియా..సౌత్ కొరియా.. జపాన్.. బ్రెజిల్.. ఇంగ్లండ్.. థాయ్ లాండ్.. సింగపైూర్ ఇలా చాలానే ఆప్షన్లు ఇచ్చారు.

దాని పక్కనే.. మీరు ఏం చేయాలో కూడా చెప్పారు. ఒకటి నుంచి తొమ్మిది అంకెల్లో మీకు నచ్చిన అంకెను ఎంపిక చేసుకోవాలని.. దానిని మూడుతో హెచ్చవేయాలని.. దానికి మూడు కలపాలని.. మళ్లీ మూడుతో హెచ్చవేయాలని కోరారు. వచ్చిన రెండు అంకెల్ని కూడితే.. మీరు వెళ్లాల్సిన గమ్యస్థానం వస్తుందని పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏ నెంబరును ఎంపిక చేసినా తుది ఫలితం మాత్రం ‘‘9’’ అంకె రావటం.. జాబితాలో ఇంట్లోనే ఉండండి అన్న సమాధానం రావటం గమనార్హం.

కరోనా వేళ.. అక్కడికి ఇక్కడకు వెళ్లాలన్న ఆలోచనలు వద్దు.. ఇంట్లోనే క్షేమంగా ఉండండి అన్న విషయాన్నికాస్త భిన్నంగా చెప్పారని చెప్పాలి. ఈ ట్వీట్ ఫజిల్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఎంతో ఉత్సాహంగా ఫజిల్ స్టార్ట్ చేసిన వారందరికి.. చివరికి వచ్చేసరికి ఒకేలాంటి సమాధానం (నెంబరు 9) రావటం గమనార్హం. ఈ ఆసక్తికర పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. విరుచుకుపడే విపత్తు వేళ.. అక్కడికి ఇక్కడకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావాలన్న సందేశాన్ని తన ట్వీట్ తో రోటీన్ కు భిన్నంగా చెప్పారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News