ఢిల్లీలో 'అమరావతి' హోరు
ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఏమిటి ఛండాలంగా? ప్రాంతానికో రాజధాని ఉంటే.. ఆ లెక్కే వేరు! ప్రాంతీయ సమతుల్యత అన్నది ప్రాంతాల వారీగా జరగాల్సిన డెవలప్ మెంట్ మీద కాకుండా రాజధానుల ఏర్పాటుతో అంటూ సరికొత్త సూత్రీకరణను తెర మీదకు తీసుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన నోటి వచ్చిన వాదనను ఆయన ఫాలోయర్స్ ఎంత బలంగా సమర్థిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే జగన్ అండ్ కో చెప్పిన వాదనే నిజమైనప్పుడు.. ప్రపంచమంతా కూడా అదే తీరును ఫాలో అయ్యేది కదా? అయినా.. మూడే ఎందుకు ఉండాలి? పది నుంచి పదిహేను రాజధానులు ఉంటే మరింత వేగంగా డెవలప్ అవుతుంది కదా? ఆ దిశగా ఎవరూ ఎందుకు డిమాండ్ చేయటం లేదు?
ఏపీ రాజధానిగా అమరాతిని నిర్ణయించటం.. తాము అధికారంలోకి వస్తే దాన్ని కొనసాగిస్తామే తప్పించి.. దాన్ని అడ్డుకోమంటూ ఎన్నికల వేళలో పెద్ద ఎత్తున చెప్పిన జగన్.. తన చేతికి పవర్ వచ్చిన తర్వాత ఆయన ఎలా వ్యవహరిస్తున్నారన్నది తెలిసిందే. నిజానికి ఫలానా ప్రాంతమే రాజధాని అనటానికి శాస్త్రీయంగా చాలానే ఆలోచించాలి. అమరావతి విషయంలో మరోప్రత్యేకత ఏమంటే ఎలాంటి వ్యతిరేకత లేకుండా రాజధాని కోసం రైతులు తమ వేలాది ఎకరాలు భూమిని ఇచ్చేందుకు ముందుకు రావటం.
అలాంటి అరుదైన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని.. తమ సమర్థతను చాటుకోవటానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తే పరిస్థితి మరోలా ఉండేది. నిజానికి రాజధాని అంశంపై పీటముడి వేయటం ద్వారా గడిచిన మూడున్నరేళ్లలో రాజధాని డెవలప్ మెంట్ కోసం ఖర్చు చేయాల్సిన వేలాది కోట్లను సంక్షేమ పథకాలకు ఖర్చు చేసేందుకు జగన్ సర్కారు ప్రాధాన్యత ఇవ్వటాన్ని మర్చిపోకూడదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజధాని కోసం వేలాది ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు.. అమరావతి కోసం చేస్తున్న సుదీర్ఘ పోరాటం తాజాగా ఢిల్లీకి చేరింది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని పేరుతో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి.. రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నా సందర్భంగా దాదాపు 1500 మంది రైతులు పాల్గొంటే.. పలు సంఘాలు.. పలు రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.
తాజా పరిణామం చూస్తే.. అమరాతిలోనే ఏపీ రాజధాని ఏర్పాటు చేయాలన్న దానిపై జగన్ పార్టీ మినహా.. మరెవరూ ఇందుకు అనుకూలంగా స్పందించటం కనిపించదు. ఇప్పటికే విపక్ష టీడీపీ అమరావతి కోసం పోరాడుతోంది. జనసేన కూడా మద్దతు ఇస్తుంది. బీజేపీ ఈ విషయంలో అమరావతి వైపే ఉంది. తాజాగా కమ్యునిస్టులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం జట్టు కట్టింది. ఇంతకాలం అమరావతిపై ఏ పార్టీ స్టాండ్ ఏమిటన్న దానిపై ఉన్న కన్ఫూజన్ తాజాగా చేపట్టిన ధర్నా పుణ్యమా అని క్లారిటీ వచ్చేసింది. తాజా ఆందోళనలో ఏడు పార్టీలు అమరావతికి అనుకూలంగా నిలిచాయి. ఇదంతా చూస్తే.. అమరావతి కారణంగా జగన్ కు వ్యతిరేకంగా కొత్త జట్టు ఏర్పడుతుందన్న భావన కలుగక మానదు.