అంబటి రాయుడు మళ్లీ ఏపీకే.. అజహార్​ టార్చర్​ తట్టుకోలేకే!

Update: 2020-12-16 06:48 GMT
ప్రముఖ క్రికెటర్​ అంబటి రాయుడు హైదరాబాద్ క్రికెట్​ అసోషియేషన్​కు గుడ్​బై చెప్పాడు. హెచ్​సీఏలో జరుగుతున్న అవినీతి.. అజహారుద్దీన్​ వైఖరితో విసిగిపోయి రాయుడు ఆంధ్రప్రదేశ్​కు వెళ్లిపోతున్నాడట. ఇప్పటికే హెచ్​సీఏ తీరుపై విమర్శలు వస్తున్నాయి. రాయుడు కూడా వెళ్లిపోవడంతో మరోసారి విమర్శలు వెళ్లువెత్తున్నాయి. ‘అంబటి రాయుడు.. ఆంధ్రప్రదేశ్​కు బదిలీ అయ్యాడు. కొత్త సీజన్​లో అతడు ఆంధ్రప్రదేశ్​కు ఆడబోతున్నాడు’ అని హెచ్​సీఏ సెక్రటరీ విజయానంద్​ చెప్పారు.  జనవరి 10 నుంచి జరిగే సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టోర్నమెంట్‌‌లో ఆంధ్రప్రదేశ్​ టీమ్‌‌ సెలెక్షన్‌‌కు అంబటి రాయుడు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయంపై త్వరలోనే ఏసీఏ (ఆంధ్రప్రదేశ్​ క్రికెట్​ అసోషియేషన్​) ప్రకటన ఇవ్వనున్నది.

 రాయుడు తన కెరీర్లో దేశవాళీ  క్రికెట్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతంలో ఆడుతూ వస్తున్నాడు. అతడు ఎక్కడా  నిలకడగా లేడు. గతంలోనూ ఓ సారి రాయుడు హెచ్​సీఏను వీడాడు. 2005-06లో అతడు ఆంధ్రప్రదేశ్​కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత బరోడా, విదర్భ జట్లకు ఆడాడు. 2017-18 సీజన్‌‌లో తిరిగి హైదరాబాద్‌‌ జట్టు‌లో చేరాడు. రెండేళ్ల పాటు ఇక్కడే ఉన్నాడు. ప్రస్తుతం  రాయుడు వెళ్లపోతుండటంతో హైదరాబాద్​ క్రికెట్​పై మరోసారి విమర్శలు వెల్లువెత్తున్నాయి. హెచ్​సీఏ అవినీతిలో కూరుకుపోయిందని.. డబ్బులు ఉన్నవాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి.  తాజాగా రాయుడు కూడా వెళ్లిపోవడంతో మరోసారి హెచ్​సీఏ వార్తల్లో నిలిచింది.

 హెచ్​సీఏ తీరుపై రాయుడు ఇప్పటివరకు బహిరంగంగా విమర్శలు చేయలేదు. తొందర్లోనే మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నది. కొద్దిరోజులుగా రాయుడికి  కష్టాలు వెంటాడుతున్నాయి. వరల్డ్ కప్పు ముందు టీమ్ ఇండియా తరఫున నాలుగో స్థానంలో బరిలోకి దిగుతున్న రాయుడు అద్భుతంగా రాణించాడు. నాలుగో నెంబర్ బ్యాట్స్ మెన్  సమస్య తీరిందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రాయుడు స్థానంలో వరల్డ్  కప్ కు విజయ శంకర్ ని ఎంపిక చేశారు.  దీంతో రాయుడు  ఆగ్రహంతో ఏకంగా సెలక్టర్ల పైన విమర్శలు చేశాడు. ఆ తర్వాత క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ఇచ్చారు. మాజీ క్రికెటర్లు,  అభిమానులు చేసిన సూచనలతో రాయుడు మళ్ళీ తన రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకున్నాడు. హైదరాబాద్ తరఫున దేశవాళీ  మ్యాచ్ లు ఆడుతూ వచ్చాడు. ఇప్పుడు హెచ్ సీఏ తీరుతో రాయుడు మళ్లీ ఆంధ్ర జట్టులోకి వచ్చాడు.
Tags:    

Similar News